ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Sep 13, 2020 , 02:22:07

అభివృద్ధికి సమష్టి కృషి

అభివృద్ధికి సమష్టి కృషి

  • n జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి
  • n ఆమె ముఖ్య అతిథిగా మండల సర్వసభ్య సమావేశం
  • n సమావేశ మందిరానికి రూ. 5 లక్షలు విడుదల
  • n సన్మానించిన సభ్యులు

పెంచికల్‌పేట: నూతన మండలం పెంచికల్‌పేట అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని  జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు కోవ లక్ష్మి హామీ ఇచ్చారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఎంపీపీ జాజిమొగ్గ సుజాత అధ్యక్షతన శనివా రం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావుతో కలిసి  పాల్గొన్నారు. ట్రాన్స్‌కో ఏఈ రవీందర్‌ తన నివేదిక చదువుతుండగా సర్పంచ్‌లు సంజీవ్‌, రాజన్న, శ్రీనివాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశా రు. గ్రామాల్లో మూడో లైన్‌ వేసేందుకు వైరు అందించడం లేదని, ఫోన్‌లో కూడా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని ప్రజా ప్రతినిధులు సభ దృష్టి కి తెచ్చారు. అంగన్‌వాడీ సూపర్‌ వైజర్‌ పద్మ వివరాలు చెప్తుండగా కొండపల్లి సర్పంచ్‌ సం దీప్‌ కలుగజేసుకొని గ్రామానికి మూడు నెల ల నుంచి గుడ్లు, పూర్తి స్థాయి సరుకులు రావ డం లేదని సభ దృష్టికి తెచ్చారు. తహసీల్దార్‌ రఘనాథ్‌ రావు మాట్లాడుతుండగా ఎల్లూర్‌ సర్పంచ్‌ దుర్గం రాజన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తమ గ్రామానికి శ్మశాన వాటిక, డంప్‌ యార్డు, పల్లె ప్రకృతి వనాలకు స్థలాలు కేటాయించలేదన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌ మధ్య ఉన్న భూవివాదంతో కేటాయించలేకపోయామని పరిష్కరించి అప్పగిస్తామని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఈజీఎస్‌ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏపీవో సతీశ్‌కు సభ సూచించింది. ఎంపీడీవో కార్యాలయానికి భవనం లేకపోవడంతో ఇబ్బంది తలెత్తుతుందని సమస్యను సీఎం దృ ష్టికి తీసుకెళ్తానని, అప్పటి వరకు తాత్కాలిక సమావేశ మందిరం నిర్మాణానికి తన నిధుల నుంచి రూ. 5లక్షలు ఇస్తున్నట్లు కోవ లక్ష్మి ప్రకటించారు. మండలానికి మొదటి సారి వచ్చిన జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మిని ఎంపీపీ, జడ్పీటీసీ, సభ్యులు, అధికారులు శాలువాలతో స న్మానించారు. జడ్పీ సీఈవో వేణు, జడ్పీటీసీ సముద్రాల సరిత, వైస్‌ ఎంపీపీ చౌదరి కమల, ఎంపీటీసీలు శారద , రాజ న్న,  కోఆప్షన్‌ స భ్యుడు సాజిద్‌, సర్పంచ్‌లు జాజిమొగ్గ శ్రీనివాస్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఏడీఏ రాజుల నా యుడు, ఎంపీవో గంగాసింగ్‌, ఏపీవో సతీశ్‌, అన్ని శాఖల అధికారులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు. 


logo