బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - Sep 13, 2020 , 02:22:09

పేదల సంక్షేమానికి పెద్దపీట

పేదల సంక్షేమానికి పెద్దపీట

  • n కొత్త రెవెన్యూ బిల్లు సాహసోపేత నిర్ణయం
  • n సుమన్‌ చెక్కుతో చీర అందించడం అభినందనీయం
  • n అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
  • n విప్‌ సుమన్‌తో కలిసి చెన్నూర్‌ నియోజకవర్గంలో పర్యటన

చెన్నూర్‌ టౌన్‌ : కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పేదల సంక్షేమానికి కృషిచేస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నా రు. చెన్నూర్‌ పట్టణంలోని సంతోషి మాత ఫంక్షన్‌ హాల్‌లో నియోజకవర్గంలోని లబ్ధిదారులకు శుక్రవారం ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌తో కలిసి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తంగా 661 మందికి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని మేనమామగా సీఎం కేసీఆర్‌ సాయం చేస్తున్నారన్నారు. ఆడపిల్లను ఇంటికి భారంగా కాకుండా లక్ష్మిగా భావించాలనే ఉద్దేశంతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఇలాంటి బృహత్తర పథకం ఏ రాష్ట్రంలోనూ లేదని గుర్తుచేశారు. నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషిచేస్తున్న యంగ్‌ అండ్‌ డైనమిక్‌ లీడర్‌ విప్‌ సుమన్‌.. పుట్టింటివారు ఇచ్చినట్లుగా కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు చీరను అందిస్తుండడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం చేపట్టిన నూతన రెవెన్యూ చట్టం చాలా గొప్పదని, అందుకే అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు. ని జామాబాద్‌ నుంచి జగ్ధల్‌పూర్‌ వరకు 30 ఏండ్లుగా కుంటుపడ్డ పనులను స్వరాష్టంలో పూర్తి చేసినట్లు తెలిపారు. జైపూర్‌ పవర్‌ప్లాంట్‌తో అధిక విద్యుదుత్పత్తి అవుతున్నదని పేర్కొన్నారు. చెక్‌డ్యాంలతో నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించేందుకు సుమన్‌ కృషిచేస్తున్నారని తెలిపారు. నీటి లభ్యత, నీరు, కరెంట్‌ పుష్కలంగా ఉండడంతో నియోజకవర్గంలో ఆయిల్‌ పామ్‌ సాగుపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. అనంతరం జడ్పీ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధికి చేస్తున్న కృషిని తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు సొంత అన్నలా చెక్కుతో పాటు సారెను (చీరను) బహుమతిగా అందించడం ఒక సంప్రదాయంగా కొనసాగిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజల సంతోషం కోసం సీఎం కేసీఆర్‌ అనే క సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టం బృహత్తరమైనదని కొనియాడారు. సమస్యలపై పది మంది తన ను కలిస్తే అందులో ఆరు భూములకు సంబంధించినవే ఉండేవని గుర్తుచేశారు. వాటికి చెక్‌ పెట్టేందు కే రెవెన్యూ చట్టం తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇక పై రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదన్నారు. ఇది పేదల కోసం తీసుకొచ్చిన బ్ర హ్మాండమైన చట్టమని పేర్కొన్నారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ఆయన ఉద్దేశమన్నారు. నియోజకవర్గంలోని పలు సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని, వాటిని ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కాళేశ్వరం నుం చి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా సాగు నీటి మంజూరుకు సీఎం అంగీకారం తెలిపారన్నారు. జోడువాగులపై చెక్‌ డ్యాం, అక్కడ పార్కు, అపూర్వమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు విశేషంగా కృషిచేస్తున్నామని, పెంపకంపై అందరూ ప్రయత్నించాలని సూచించారు. పెద్ద చెరువును అభివృద్ధి చేస్తున్నామన్నారు. పట్టణంలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులను ఈ సందర్భంగా ఆయన వివరించారు. నియోజకవర్గంలో యువకుల కోసం స్టడీ సర్కిల్‌ పెట్టబోతున్నట్లు చె ప్పారు. అలాగే పలు పరిశ్రమల స్థాపనతో వారికి ఉపాధి లభించేలా చేయనున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి ఐకే రెడ్డిని విప్‌ బాల్క సుమన్‌, ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ అర్చనా గిల్డా, పలువురితో కలిసి సత్కరించారు. నియోజకవర్గవ్యాప్తంగా పలు సమస్యలను, ముఖ్యంగా అటవీ, రెవెన్యూ వారి స్థలాలపై ఉన్న ఇబ్బందులను తొలగించాలని విన్నవించగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

చేప పిల్లల విడుదల..

అనంతరం మంత్రి, విప్‌, మున్సిపల్‌ చైర్మన్‌, పలువురు నాయకులు పట్టణంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అర్బన్‌ పార్కుతో ప్రయోజనం..

చెన్నూర్‌ రూరల్‌ : నియోజకవర్గంలో ఏర్పాటు చేసే అర్బన్‌ పార్కుతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు ఎంతో ప్రాధాన్యత వస్తుందని మంత్రి అన్నారు. కిష్టపేట నర్సరీలో ఏర్పాటు చేస్తున్న పార్కు స్థలాన్ని విప్‌ సుమన్‌, అధికారులతో కలిసి పరిశీలించారు. పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అటవీ శాఖ భూముల సమస్య ఉంటే సీఎం కేసీఆర్‌తో చర్చించి, అనుమతులు వచ్చేలా చూస్తామని తెలిపారు. నియోజకవర్గానికో అర్బన్‌ పార్కు ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. పార్కు నిర్మాణం కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపామని, సీఎం కేసీఆర్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని మంత్రికి విప్‌ వివరించారు. అనంతరం నర్సరీలో అటవీ శాఖ అధికారుతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణిగుంట్ల ప్రవీణ్‌ కుమార్‌, ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, ఎఫ్‌డీవో రాజారావ్‌, ఎఫ్‌ఆర్‌వో మధుసూదన్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మల్లెల దామోదర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు అయిత సురేశ్‌ రెడ్డి, రత్న సమ్మిరెడ్డి, నాయకులు, అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. 

ఆయిల్‌పామ్‌ తోట పరిశీలన..

భీమారం : పోలంపల్లి పరిధిలోని తాళ్లగూడెం గ్రామంలో విప్‌ సుమన్‌ సాగు చేస్తున్న ఆయిల్‌పామ్‌ తోటను మంత్రి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఆయిల్‌పామ్‌ రోల్‌మోడల్‌గా మారబోతుందని, సాగుకు రైతులు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సాగుపై మంత్రికి విప్‌ అవగాహన కల్పించారు. ఇందులో మూడేళ్లు అంతరపంటలు వేసుకోవచ్చని, నాలుగు సంవత్సరాల అనంతరం అల్లం వంటి పంటలు సాగుచేయవచ్చని తెలిపారు. మంచి దిగుబడులు వస్తాయని వివరించారు.


logo