మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Sep 11, 2020 , 03:04:59

కొత్త చట్టంతో రైతులకు మేలు

కొత్త చట్టంతో రైతులకు మేలు

  • n ధరణి  పోర్టల్‌తో పారదర్శకత 
  • n సర్కారు పథకాలు పక్కాగా అమలవుతాయి 
  • n ‘నమస్తే’తో రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ గట్టయ్య

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చ ట్టంతో ప్రయోజనాలెన్నో ఉన్నాయని రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ కే. గట్టయ్య అన్నారు. ఈ చట్టం  రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చేలా ఉందని పే ర్కొన్నారు.  భూ వివరాలతో కూడిన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకు రావడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. బ్యాంకుల్లో పంట రుణాలు పొందడం సులభతరం కావడంతో పాటు రైతు బంధు, రైతుబీమా, రుణమాఫీ లాంటి సంక్షేమ పథకాలు పకడ్బందీగా వ ర్తిస్తాయన్నారు. ఈ చట్టంలో అవినీతికి అవకాశం లేదని రికార్డులు తారు మారు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవచ్చన్నారు. వీఆర్వోల అలస త్వం కారణంగా రైతులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వ్యవస్థ రద్దు వల్ల వీఆర్వోలకు ఎలాంటి ఉద్యోగ భయం లేదని, వారిని వేరే శాఖల్లోకి పంపేం దుకు వీలుందన్నారు. ఈ మేరకు గురువారం ‘నమస్తే తెలంగాణ’ ఇంట ర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించారు..

ప్రశ్న: కొత్త రెవెన్యూ చట్టం వల్ల రైతులకు ప్రయోజనాలెంటి?

జవాబు: ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టం అహ్వానిం చదగినది. ఎలక్ట్రానిక్‌ విధానంలో  భూములకు సంబంధించిన రికార్డుల నిర్వహణ జరుగుతుంది. జాయింట్‌ రిజిస్ట్రార్లుగా తహసీల్దార్లకు అధికారాలు ఇవ్వడంతో రైతులకు సంబంధించిన భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో పా రదర్శకత పెరుగుతుంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు త హసీల్దార్లకు అప్పగించడంతో భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ తొందరగా పూర్తవుతుంది. ప్రస్తుతం మ్యుటేషన్‌లో చాల జాప్యం నెలకొంటున్నది. త హసీల్‌ కార్యాలయాల్లో కోర్టులను రద్దు చేశారు. వారికి ఇతర అధికారాలు అలాగే ఉన్నాయి. సపోర్టింగ్‌ స్టాఫ్‌ ఉంటే పనులు తొందరగా జరుగుతాయి..

ప్రశ్న: ధరణి వెబ్‌సైట్‌తో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి?

రైతులకు తమ భూములకు సంబధించిన వివరాలు ఎక్కడి నుంచైనా చూసుకునే అవకాశం ఉంటుంది. తహసీల్‌ కార్యాలయాల చుట్టూ తిరగ కుండా పోర్టల్‌లో భూముల వివరాలు తెలుసుకోవచ్చు. ఇందులో వివరాలు పక్కాగా నమోదు చేయాల్సి ఉంటుంది. రైతులు కొనుగోలు చేసిన భూమిపై హక్కులు పొందాలంటే చాలా సమయం పట్టేది. ఈ పోర్టల్‌ ద్వారా జాప్యం ఉండదు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీలాంటి పథకాలు అర్హులైన రైతులందరికీ వర్తిస్తాయి.

ప్రశ్న: బ్యాంకు రుణాలు తీసుకోవడానికి రైతులకు ఈ చట్టంతో మేలేంటి?

బ్యాంకు రుణాల కోసం రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప ట్టాదారు పాసుపుస్తకం, టైటిల్‌ డీడ్‌ ఉంటేనే బ్యాంకు అధికారులు అను మతిస్తారు. పంట రుణం తీసుకునే ప్రతిసారి పహాణీలు వీఆర్వోలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో కొన్ని సార్లు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. కొత్త రెవె న్యూ చట్టంతో ఇలాంటి సమస్యలకు చెక్‌ పడుతుంది. డిజిటల్‌ వివరాల ఆధారంగా రైతులకు రుణాలు అందనున్నాయి. ఇకపై బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు.

ప్రశ్న: వీఆర్‌వో వ్యవస్థ రద్దుపై మీ అభిప్రాయం..?

గ్రామాల్లో భూముల విషయంలో వీఆర్వోలే కీలకం. దీంతో రైతులు వీఆర్వోలను సంప్రదించాల్సి వచ్చేది. కానీ కొందరి వల్ల ఈ వ్యవస్థ అక్రమాలకు అలవాటు పడింది. దీనిపై ఆరోపణలు ఎక్కువవడంతో, ప్రభు త్వం పూర్తిగా వ్యవస్థనే రద్దు చేసి, అక్రమార్కులకు ఒక హెచ్చరికను పంపిం ది. సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం ప్రకటించి, వారి కుటుం బాలు రోడ్డున పడకుండా చేశారు. 


logo