బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Sep 09, 2020 , 02:24:51

సంస్థ అభివృద్ధికి కృషి చేయాలి

సంస్థ అభివృద్ధికి కృషి చేయాలి

  •  జీఎం లక్ష్మీనారాయణ 
  • ఎంవీటీసీలో యువ కార్మికులకు అవగాహన సదస్సు

మంచిర్యాల టౌన్‌(శ్రీరాంపూర్‌ ): సింగరేణిలో నూతనంగా చేరుతున్న బదిలీ వర్కర్లు సంస్థ అ భివృద్ధికి కృషి చేయాలని శ్రీరాంపూర్‌ జీఎం కే లక్షీనారాయణ పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్‌ ఎంవీటీసీలో శిక్షణ పొందుతున్న కారుణ్య యువ కార్మికులకు జీఎం సంస్థపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, సంస్థలో చేరుతున్న కార్మికులు అంకిత భావంతో పని చేయాలని సూచించారు.  సింగరేణి సంస్థ లాభాల్లో కొనసాగుతున్నదన్నారు. యువ కార్మికులు సంస్థలో వారి విద్యార్హతను బట్టి వివిధ క్యాటగిరీల పనులు ఎంచుకొని ఉద్యోగోన్నతి పొం దాలన్నారు. కార్మికులు రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలని తెలిపారు. కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీటీసీ మేనేజర్‌ వెంకటరామారావు, తదితరులు ఉన్నారు.


logo