మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Sep 08, 2020 , 01:31:43

పురాతన బుద్ధ విగ్రహం స్వాధీనం

పురాతన బుద్ధ విగ్రహం స్వాధీనం

  • n ఆరు కిలోలు.. రూ.30 లక్షల విలువైనదిగా గుర్తింపు
  • n చెన్నూర్‌లో వల పన్ని పట్టుకున్నటాస్క్‌ఫోర్స్‌ పోలీసులు..
  • n అదుపులో ముగ్గురు.. మరొకరు పరారీ..

చెన్నూర్‌:  పురాతన బుద్ధ విగ్రహం విక్రయించేందుకు యత్నించిన ఓ ముఠాను చెన్నూర్‌ బస్టాండ్‌ ప్రాంతంలో రామగుండం కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం వలపన్ని పట్టుకున్నారు. చెన్నూర్‌ బస్టాండ్‌ ప్రాంతంలో కొంత మంది అనుమానాస్పదంగా తిరుగుతున్నారనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిఘా పెట్టారు. నలుగురు వ్యక్తులు చేతిలో సంచి పట్టుకొని అనుమానాస్పదంగా సంచరించడాన్ని పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు  ప్రయత్నిస్తుండగా ఒకరు పారిపోగా, ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న సం చిని తనిఖీ చేయగా అందులో ఆరు కిలోల బరువున్న అతి పురాతన బుద్ధ విగ్రహం లభ్యమైంది. పట్టుబడిన వారిని విచారించగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌కు చెందిన తుం గోస విద్యాసాగర్‌, మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన బింగి ప్రసాద్‌, గూడ శ్రీనివాస్‌గా తేలింది. సర్వాయిపేటకు చెందిన చేతరాశి సురేశ్‌ పరారీలో ఉన్నాడు. విగ్రహం బరువు ఆరు కిలో లు ఉండగా, దీని విలువ సుమారు రూ. 30లక్ష లు ఉంటుందని పోలీసులు వివరించారు. దీన్ని విక్రయించేందుకు చెన్నూర్‌కు తీసుకువచ్చి పోలీసులకు చిక్కారు. నిందితులతో పాటు బుద్ధ విగ్రహాన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు.logo