శుక్రవారం 23 అక్టోబర్ 2020
Mancherial - Sep 08, 2020 , 01:31:45

కుంటాల సొసైటీలో అక్రమాలు ?

కుంటాల సొసైటీలో అక్రమాలు ?

  • n లెక్కతేలని రూ. 13 లక్షలు
  • n డీసీవో ఆదేశాలతో విచారణ
  • n సంఘం రికార్డుల స్వాధీనం

కుంటాల : కుంటాల సహకార సంఘంలో భారీగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. రాయి తీ ఎరువులను విక్రయించిన సిబ్బంది రైతుల నుంచి తీసుకున్న డబ్బులను మార్క్‌ఫెడ్‌ అధికారులకు చెల్లించలేదని సమాచారం. డీసీవో ఆదేశాల మేరకు కుంటాల సహకార సంఘంలో ఎరువుల నిల్వలు, విక్రయాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి డివిజన్‌ స్థాయి అధికారి తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. స్టాక్‌ రిజిస్టర్‌కు, గోదాంలో నిల్వ ఉన్న స్టాక్‌కు భారీగా వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం. రూ. 13 లక్షల మేర ఎరువుల విక్రయానికి సంబంధించిన డబ్బులను సిబ్బంది మార్క్‌ఫెడ్‌ అధికారులకు జమ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎరువుల విక్రయానికి సంబంధించిన డబ్బులు కొందరు సిబ్బంది దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2018-19కి సంబంధించి ధాన్యం కొనుగోలులో రూ. 1.96 లక్షలు సొసైటీ కి నష్టం వచ్చినట్లు సమాచారం. ఇందులో సిబ్బం ది పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన అధికారులు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ఉన్నతాధికారులకు నివేదిస్తాం

డీసీవో ఆదేశాల మేరకు కుంటాల సహకార సంఘంలో తనిఖీలు చేపట్టామని సబ్‌ డివిజనల్‌ కో-ఆపరేటివ్‌ అధికారి సత్యనారాయణ తెలిపారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా తెచ్చిన ఎరువుల విక్రయానికి సంబంధించిన నిల్వలు పోను తేడాలు ఉన్నట్లు తెలిపారు. రూ. 13 లక్షల మేర మార్క్‌ఫెడ్‌ అధికారులకు డబ్బులు జమ చేయాల్సి ఉందన్నారు.  2018-19 లో ధాన్యం కొనుగోలులో రూ.1. 96 లక్షలు సొసైటీ నష్టపోయి, కమిషన్‌ డబ్బుల నుంచి చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ విషయమై సొసైటీ సీఈవో శ్రీనివాస్‌ రెడ్డిని వివరణ కోరగా పీఏసీఎస్‌లో ఎలాంటి అక్రమాలు జరుగలేదన్నారు. తనిఖీ అధికారి కార్యాలయానికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నది  వాస్తవమేనని స్పష్టం చేశారు.


logo