గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Sep 07, 2020 , 01:45:15

పర్యావరణ పరిరక్షణకే హరితహారం

పర్యావరణ పరిరక్షణకే హరితహారం

  • మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌

ఆదిలాబాద్‌ రూరల్‌: పర్యావరణ పరిరక్షణకే సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్‌లో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ప్రతి కాలనీలోని పార్కులు, రహదారులకిరువైపులా, మున్సిపల్‌ స్థలాల్లో మొక్కలు నాటుతున్నామన్నారు. అంతేగాకుండా ఇంటింటికీ అవసరమైన పండ్లు, పూల మొక్కలను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి త్వరలోనే పంపి ణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నమని చెప్పారు. ప్రజ లు కూడా భాగస్వాములై మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ జహీర్‌ రం జానీ, కౌన్సిలర్‌ బండారి సతీశ్‌ పాల్గొన్నారు.

మిషన్‌ భగీరథ పనులు త్వరగా పూర్తి చేయాలి

మున్సిపల్‌లో మిషన్‌భగీరథ పైప్‌లైన్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను మున్సిపల్‌ చైర్మన్‌ ఆదేశించారు. పట్టణంలోని సినిమా రోడ్‌లో వేసిన పైప్‌లైన్ల ద్వారా నీరు రావడంలేదని వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. త్వరలో ప్రధాన వీధుల్లో రోడ్లు వేయనున్నామని, ఆలోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. logo