శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Sep 06, 2020 , 02:35:35

రిటైర్డ్‌ ఎస్పీ సేవలకు గుర్తింపు

రిటైర్డ్‌ ఎస్పీ సేవలకు గుర్తింపు

  •  తెలుగు బుక్‌ రికార్డులో చోటు సంపాదించిన శశిధర్‌ రాజు

నిర్మల్‌ అర్బన్‌ : నిర్మల్‌ జిల్లా పోలీస్‌ శాఖలో సూపరింటెండెంట్‌గా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన శశిధర్‌ రాజుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన విధులు నిర్వర్తించిన సమయంలో జిల్లాలో విద్య, వైద్యం, విజ్ఞానం వంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. వీటికి గుర్తింపునిస్తూ శనివారం హైదరాబాద్‌లో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు సంస్థ అధ్యక్షుడు చింతపట్ల వెంకటాచారి ధ్రువీకరణపత్రాన్ని, జ్ఞాపికను అందజేశారు. పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా శశిధర్‌ రాజు మాట్లాడుతూ.. 35 ఏండ్ల ఉద్యోగ ప్రయాణంలో వేలాది మందికి సేవలు అందించడం, పేద విద్యార్థులకు జాబ్‌మేళా నిర్వహించి వెయ్యి మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. పలుచోట్ల పేదల కోసం నిర్వహించిన వైద్య శిబిరాలు సంతృప్తినిచ్చాయన్నారు. తన సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడంతో ఇంకా సేవాభావం పెరిగిందని పేర్కొన్నారు. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించిన శశిధర్‌ రాజును పలువురు పోలీసు అధికారులు అభినందించారు.logo