శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Sep 05, 2020 , 01:54:21

అర్హులందరికీ పథకాలు అందాలి

అర్హులందరికీ పథకాలు అందాలి

  •  n   బజార్‌ హత్నూర్‌ ఎంపీపీ  జయశ్రీ
  •  n  ఎంపీడీవో కార్యాలయంలో మండల సమావేశం
  •  n  హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు

బజార్‌హత్నూర్‌ :  అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఎంపీపీ అజీడే జయశ్రీ అన్నారు. ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయాశాఖల అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నదని, అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. అనంతరం వ్యవసాయధికారి ప్రమోద్‌రెడ్డి మాట్లాడుతూ పట్టాపాసు పుస్తకం వచ్చిన రైతులు ఈనెల 5 లోగా రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండలంలో సరిపడా ఎరువులు ఉన్నాయన్నారు. అనంతరం పశువైద్యాధికారి పర్వేజ్‌ హైమాద్‌ మాట్లాడుతూ లంపిస్కిన్‌ వ్యాధికి టీకా లేదని, వ్యాధి సోకిన పశువులకు మిగ తా పశువులను దూరంగా ఉంచాలన్నారు. అనంతరం ఎంఈ వో శ్రీకాంత్‌ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ తరగతులు నడుస్తున్నాయన్నారు. అదేవిధంగా ఇరిగేషన్‌, ఐకేపీ, ఈజీఎస్‌, పౌర సరఫరాలు, అటవీ, విద్యుత్‌, వైద్యం, తాగునీరు, పంచాయతీరాజ్‌ తదితర శాఖల అభివృద్ధి పనులపై సమీక్షించారు. తహసీల్దార్‌ గంగాధర్‌, ఎంపీడీవో శంకర్‌, వైస్‌ ఎంపీపీ పొరెడ్డి శ్రీనివాస్‌, పీఆర్‌ ఏఈ నారాయణ, విద్యుత్‌ ఏఈ సదానందం, ఆయాశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.logo