బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Sep 05, 2020 , 01:54:21

నెలాఖరులోగా పూర్తిచేయాలి

నెలాఖరులోగా పూర్తిచేయాలి

  • n మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి 
  • n అధికారులతో సమీక్ష

మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌) : జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి జిల్లా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖలు, ఏఈలు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రైతు వేదికలు, కల్లాలు, డంప్‌యార్డులు, వైకుంఠధామాలను గడువులోగా పూర్తిచేయాలన్నారు. వేదికల పనుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరయ్య, డీఆర్డీవో శేషాద్రి, జిల్లా పంచాయతీ రాజ్‌ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రామకృష్ణాపూర్‌ :  బొక్కలగుట్ట, సండ్రోనిపల్లె ల్లో రైతువేదికల పనులను కలెక్టర్‌ పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సర్పంచ్‌లు బొలిశెట్టి సువర్ణ, సదిలను ఆదేశించారు. పనులు ఆలస్యంగా సాగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్‌, కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి సమన్వయకర్త రాజేశ్వర్‌, నాయక్‌, చెన్నూర్‌ ఏడీఏ బాపు, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, తహసీల్దార్‌ వీ మోహన్‌రెడ్డి, ఇన్‌చార్జి వ్యవసాయ అధికారి మార్క్‌గ్లాడిస్టన్‌, ఎంపీవో షేక్‌ సఫ్దర్‌అలీ, ఏఈవో ముత్యం తిరుపతి, ఏపీవో రజియా, నాయకులు కనకయ్య, ఫిరోజ్‌ ఉన్నారు.

నెన్నెల : మూడు క్లస్టర్ల పరిధిలోని రైతు వేదికల పనులను కలెక్టర్‌ పరిశీలించారు. పనుల తీరుపై ఆరాతీశారు. ఎప్పుడు పూర్తవుతాయని పీఆర్‌ ఇం జినీర్‌ను అడిగారు. నత్తనడకన సాగుతున్నాయని, గతంలో కూడా ఇలానే చేశారని సర్పంచ్‌లను మందలించారు. త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. చిత్తాపూర్‌, గొల్లపల్లి క్లస్టర్లలోని జోగాపూర్‌, నెన్నెల క్లస్టర్‌ వేదికలను గడువులోగా పూర్తిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కలెక్టర్‌ వెంట ఏడీఏ ఇంతియాజ్‌, ఏవో శ్రీకాంత్‌, సర్పంచ్‌లు పద్మ, నవీన్‌గౌడ్‌, ఈవోలు రాంచందర్‌, సుప్రజ, మౌనిక ఉన్నారు.


logo