శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Sep 04, 2020 , 02:08:25

దరఖాస్తుల హార్డు కాపీలు అందజేయాలి

దరఖాస్తుల హార్డు కాపీలు అందజేయాలి

  •  ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

ఎదులాపురం: పోస్ట్‌ మెట్రిక్‌ 2019-2020 సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల హార్డు కాపీలను అందజేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. గురువారం జిల్లాలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపకారవేతనాలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెంటనే హార్డు కాపీలను సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు. పలు కారణాల వలన విద్యార్థులు దరఖాస్తు చేసుకోకుంటే కారణాలు తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. రెండు వారాల్లో మళ్లీ సమీక్షిస్తామన్నారు. షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాలో పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాల కోసం 3726 దరఖాస్తులు చేసుకో గా ఇప్పటి వరకు  2253 మందికి ఉపకారవేతనాలు చెల్లించ డం జరిగిందన్నారు. 654 పెండిగ్‌లో ఉన్నాయని మిగతావి బడ్జెట్‌ రాగానే చెల్లిస్తామన్నారు. సమావేశంలో పర్యవేక్షకుడు మనోహర్‌, ప్రిన్సిపాల్స్‌ తదితరులు పాల్గొన్నారు.