గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Sep 01, 2020 , 02:25:46

సింగరేణిలో మైనింగ్‌ అధికారుల బదిలీ

సింగరేణిలో మైనింగ్‌ అధికారుల బదిలీ

మంచిర్యాల టౌన్‌ (శ్రీరాంపూర్‌) : సింగరేణిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న మైనింగ్‌ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు జీఎంలు, డీవైజీఎం, అదనపు జీఎం, నలుగురు డిప్యూటీ మేనేజర్లు, ఆరుగురు ఎస్‌ఈలను బదిలీ చేసింది. సాధారణంగా ఏప్రిల్‌, మే నెలల్లోనే వీరిని బదిలీ చేయాల్సి ఉంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆలస్యమైనట్లు తెలిసింది. కార్పొరేట్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ జీఎం జీ వెంకటేశ్వర్‌రెడ్డిని కార్పొరేట్‌ సేఫ్టీ జీఎంగా, డైరెక్టర్‌ (పీపీ) కార్పొరేట్‌ జీఎం సయ్యద్‌ హబీబ్‌ హుస్సేన్‌ను జీఎం క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కార్పొరేట్‌ జీఎంగా బదిలీ చేశారు. కార్పొరేట్‌ మెటీరియల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ డీవైజీఎం బూర రవీందర్‌ను ప్రాజెక్టు ప్లానింగ్‌ కార్పొరేర్‌ట్‌కు, అక్కడ పని చేస్తున్న సీహెచ్‌ వెంకటరమణను హైదరాబాద్‌ స్టాటేజిక్‌ ప్లానింగ్‌ విభాగానికి, కార్పొరేట్‌ సీపీఅండ్‌పీ నుంచి ఎం సతీశ్‌కుమార్‌ను డిప్యూటీ మేనేజర్‌ స్టాటేజిక్‌ ప్లానింగ్‌ (హైదరాబాద్‌)కు బదిలీ చేశారు. టీ వినోద్‌కుమార్‌ భూపాలపల్లి ఎంవీటీసీ నుంచి కేకే-1 ఇైంక్లెన్‌ మందమర్రికి, శ్రీరాంపూర్‌ ఓసీపీ సేఫ్టీ ఆఫీసర్‌, డిప్యూటీ మేనేజర్‌ కే వెంకటేశ్వర్‌రెడ్డిని శ్రీరాంపూర్‌ ఎస్సార్పీ-3 గనికి బదిలీ చేశారు. భూపాలపల్లి కేటీకే -5 డిప్యూటీ మేనేజర్‌ కే ఆంజనేయప్రసాద్‌ను ఆర్‌జీ-1 ఎన్విరాన్‌మెంట్‌కు, ఎస్‌ఈ ఎం రాంగోపాల్‌రెడ్డిని కార్పొరేట్‌ సీపీఅండ్‌పీసీ, ఇల్లందు ఎస్‌ఈ అంజిరెడ్డిని ఎస్‌అండ్‌పీసీ ఇల్లందుకు, అక్కడ పని చేస్తున్న ఎన్‌ శ్రీనివాసరావును ఇల్లందుకు, మందమర్రి ఎస్‌అండ్‌పీసీ ఎస్‌ఈగా పనిచేస్తున్న మురళీకృష్ణను కేకే ఓసీ మందమర్రికి, డిప్యూటీ ఎస్‌ఈగా మందమర్రిలో పని చేస్తున్న నగునూరి రవిని మందమర్రి ఎస్‌అండ్‌పీసీకి బదిలీ చేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే ఆయా ఏరియాల జీఎంలకు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.