బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Aug 31, 2020 , 00:18:24

సద్గురు పూలాజీబాబా సేవలు మరువలేనివి

సద్గురు పూలాజీబాబా సేవలు మరువలేనివి

జైనూర్‌: పరమహంస సద్గురు పూలాజీబాబా ప్రజలకు అందించి న సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, జడ్పీచైర్‌పర్సన్‌ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలంలోని పాట్నాపూర్‌ గ్రామంలో గల సిద్ధేశ్వర అలయంలో ఆదివారం నిర్వహించిన సద్గురు పూలాజీబాబా జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు సద్గురు పూలాజీబాబా అన్నారు. ఆయన చూపిన మార్గం లో ప్రతి ఒక్కరూ నడువాలని పేర్కొన్నారు. బాబా హితబోధనలు విని ఆయన చూపించిన మార్గంలో నడిచి లక్షలాది మంది సన్మార్గంలో నడుస్తున్నారన్నారు. సిద్ధ్దేశ్వర ఆలయ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సద్గురు పూలాజీబాబా ఆలయ ఏర్పాటుకు తయారు చేసిన డెమో ను తిలకించారు. రూ.4 కోట్లతో నూతన ఆలయ నిర్మాణానికి స న్నాహాలు చేస్తున్నామని, ప్రభుత్వం ద్వారా నిధుల మంజూరుకు కృషిచేయాలని ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, జడ్పీచైర్‌పర్సన్‌ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కును ట్రస్టు సభ్యులు కోరారు. సీఎం కేసీఆర్‌ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి నిధులు మంజూరు చేసేందు కు కృషిచేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్‌కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, ఆర్డీవో సిడాం దత్తు, మ్యూజియం డైరెక్టర్‌ సత్యనారాయణ, జైనూర్‌, సిర్పూర్‌(యు) ఎంపీపీలు కుమ్ర తిరుమల, తొడసం భాగ్యలక్ష్మి, తహసీల్దార్‌ భుజంగ్‌రావ్‌, ఎంపీటీసీ లట్పటె మహాదేవ్‌, సిద్ధేశ్వర ఆలయ ట్రస్టు అధ్యక్షుడు కేశవ్‌ ఇంగ్లే, నాయకులు మెస్రం అంబాజీ, లచ్చు, ట్రస్టు సభ్యులు వామన్‌ ఇంగ్లే, డుక్రె సుభాష్‌, తదితరులు పాల్గొన్నారు.logo