శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Aug 31, 2020 , 00:18:07

‘సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం..’

‘సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం..’

ఎదులాపురం : రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖలో పని చేస్తున్న అన్ని వర్గాల ఉద్యోగులందరూ కలిసికట్టుగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటు చేశామని రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ కత్తి జనార్దన్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీలను ఎన్నుకోవ డంలో భాగంగా ఆదిలాబాద్‌ కమిటీని ఆదివారం ఎన్నుకున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయ సమావేశమందిరంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్య ఉద్యోగులందరూ హాజరయ్యారు. జేఏసీ ముందుండి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. కరోనాతో పోరాడి మృత్యువాత పడిన వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందికి సంతాపం తెలిపారు. అనంతరం జిల్లా జేఏసీని ప్రకటించారు. జిల్లా చైర్మన్‌గా తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ ఆసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మెట్‌పెల్లివార్‌ శ్రీధర్‌, జిల్లా కన్వీనర్‌గా తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం టీఆర్‌ఎస్‌కేవీ అనుబంధం జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ, కోశాధికారిగా డాక్టర్‌ క్రాంతి, వైస్‌చైర్మన్లుగా డాక్టర్‌ శ్రీకాంత్‌, తుల రామకృష్ణ, సిడాం వామన్‌రావు, వర్కింగ్‌ కమిటీ చైర్మన్‌గా ధనుంజయ్‌ తదితరులను ఎన్నుకున్నారు.logo