గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Aug 28, 2020 , 02:34:31

మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

జైనూర్‌ : మత్య్సకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల అన్నారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో  మ త్స్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చేపపిల్లలు గురువా రం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలవ్యాప్తంగా 16 చెరువులు ఉన్నాయని, వాటిలో పెంచేందుకు ప్రభు త్వం 75 వేల చేప పిల్లలు ఉచితంగా అందించిందన్నారు. సహకార సంఘం చైర్మన్‌ కొడప హన్నుపటేల్‌, సర్పంచ్‌లు మడావి భీంరావ్‌, మెస్రం పార్వతీ లక్ష్మణ్‌, సిడాం భీంరావ్‌, ఎంపీటీసీ లట్పటె మహదేవ్‌, నాయకులు మెస్రం అంబాజి, రవీందర్‌ ఉన్నారు.logo