గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Aug 27, 2020 , 02:39:13

జలసవ్వడి.. ఆశల దిగుబడి

జలసవ్వడి.. ఆశల దిగుబడి

  • పుష్కలంగా వర్షాలతో పంటలకు కళ n కుమ్రం భీం జిల్లాలో 4, 55,266 ఎకరాల్లో సాగు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ:  జిల్లాలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో  రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వానకాలం సీజన్‌లో 4లక్షల 55 వేల 266  ఎకరాల్లో పంటలు వేశారు.  ప్రస్తుతం సరిపడా వర్షాలు కురుస్తుండడంతో, పంటలకు ఢోకా లేకుండా పోయింది. పచ్చని పైర్లతో పల్లెలు కళకళ లాడుతున్నాయి.  ఈ సీజన్‌లో పత్తి, జొన్న, సోయా పంటలు అ ధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా.

నిండుకుండల్లా చెరువులు, వాగులు

జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహి స్తున్నాయి.  రెండేళ్లుగా సరైన వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొ న్న రైతాంగానికి, ఇటీవల కురిసిన వానలు ఊపిరి నింపాయి. జి ల్లాలో ప్రధానంగా పత్తి, కంది, సోయా, మిర్చి పంటలకు ఈ వర్షాలతో అనువైన వాతావరణం ఏర్పడిందని రైతులు ఆశాభావం వ్య క్తం చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా పత్తి సుమారు 3లక్షల  60 వేల ఎకరాలు, వరి 60,323,  జొన్న 5736, కంది 35వేలు, పె సర 5500, సోయాబీన్‌ 3వేల ఎకరాల్లో  సాగవుతున్నట్లు అధి కారులు అంచనా వేస్తున్నారు.

పూర్తయిన వరినాట్లు

జిల్లాలో 60,323 ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారు. ఈ ఏడాది చె రువులు, ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు చేరడంతో, ఈ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అడ, వట్టివాగు ప్రాజెక్టుల నుంచి పంటలకు నీరు విడుదల చేశారు.  గతేడాది కంటే ఈసారి వరి సాగు పెరిగింది.  దీంతో పాటు పత్తి, కంది, జొన్న, సోయా, ఇతర పప్పు దినుసులు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో  మిషన్‌ కాకతీయ పథకం ద్వారా పునర్జీవం పొందిన చెరువులు రైతుల పంటలకు పుష్కలం గా సాగునీరు అందిస్తున్నాయి. జిల్లాలో మొదటి విడుతలో 185 , రెండో విడుతలో 121, మూడో విడుతలో 63 చెరువులు పునరుద్ధరించారు. వీటితో సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ఇవేకాకుండా జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన కు మ్రం భీం,  వట్టి వాగు ప్రాజెక్టుల నుంచి  నీటిని విడుదల చేస్తున్నారు.  వీటితో  రెబ్బెన, వాంకిడి, కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మం డలాల్లోని పంటలకు నీరు అందుతున్నది.  

854.2 మి.మీ వర్షపాతం నమోదు

జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 805. 6 మి.మీ కాగా  ఇప్ప టి వరకు 854.2 మి.మీ నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 6 శాతం ఎక్కువగా కురిసింది. రెబ్బెన, బెజ్జూర్‌, పెంచికల్‌పేట్‌, దహెగాం మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జైనూర్‌లో 768.1 మి.మీ, సిర్పూర్‌-యులో 805.7, లింగాపూర్‌లో 849. 4, తిర్యాణిలో 775.2, రెబ్బెనలో 884.4, ఆసిఫాబాద్‌లో 600. 9, కెరమెరిలో 649.6, వాంకిడిలో 695.3, కాగజ్‌నగర్‌లో 766.8, సిర్పూర్‌(టి)లో 804.1, కౌటాలలో 782.6, చింతలమానెపల్లిలో 731.0, పెంచికల్‌పేట్‌లో 1326.1, దహెగాంలో 1196.4 మి.మీ వర్షపాతం నమోదైంది. 


logo