బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Aug 27, 2020 , 02:39:14

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

  •  జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

ఇంద్రవెల్లి : పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచించారు. మండలంలోని మెండపల్లి గ్రామంలో చేపట్టిన రైతు వేదిక నిర్మాణ పనులను బుధవారం కలెక్టర్‌ పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించా రు. ఆనంతరం ముత్నూర్‌, కెస్లాపూర్‌, దేవాపూర్‌ గ్రామాలను సందర్శించి సమస్యలపై ఆరా తీశా రు. ప్రకృతి వనాల్లో అధికారులతోపాటు  సర్పంచ్‌లతో కలిసి వివిధ రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి వనా ల్లో అన్ని రకాల మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో వనాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీ ణ అభివృద్ధి అధికారి రాజేశ్వర్‌ రాథోడ్‌, మండల ప్రత్యేక అధికారి జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ రాఘవేంద్రరావు, ఎంపీడీవో రమాకాంత్‌, ఎంపీవో సంతోష్‌, ఏపీవో సంతోష్‌ జైస్వాల్‌, ఈసీ జాదవ్‌ శ్రీనివాస్‌, ఎంపీటీసీ మడావి భీంరావు, సర్పంచ్‌ లు బాగుబాయి, మెస్రం రేణుకాబాయి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి వనాలను పూర్తి చేయాలి

తాంసి : గ్రామాల్లో చేపడుతున్న పల్లె ప్రకృతి వనాల పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ సూచించారు. మండలంలోని పొన్నారి, హస్నాపూర్‌, తాంసి గ్రామాల్లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన పల్లె ప్రకృతి వనాలతోపాటు డంప్‌ యార్డ్‌, వర్మికంపోస్ట్‌ షెడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ వీటి నిర్మాణానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు. ఎలాంటి లోపాలు లేకుండా పను లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఈయన వెంట ఎంపీడీవో ఆకుల భూమయ్య, తహసీల్దార్‌ సం ధ్యారాణి, ఎంపీవో సుధీర్‌రెడ్డి, సర్పంచ్‌లు కృష్ణ, నర్సింగ్‌, సంజీవ్‌రెడ్డి, ఎంపీటీసీలు రఘు, వన్నెల నరేశ్‌, తదితరులు ఉన్నారు.logo