సోమవారం 19 అక్టోబర్ 2020
Mancherial - Aug 26, 2020 , 02:24:40

అనాథలు కారు.. అండగా ఉంటా..

అనాథలు కారు.. అండగా ఉంటా..

  • lపోషణతో పాటు చదువుల బాధ్యత నాదే
  • lఎరడపల్లిలో అనాథ బాలికలకు పరామర్శ సందర్భంగా  ఎమ్మెల్యే రసమయి

శంకరపట్నం: చిన్నారులు అభినయ, ఆలయ అనాథలు కారని, వారికి తాను అండగా నిలబడతానని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. ఎరడపల్లి గ్రామానికి చెందిన నాగుల రమేశ్‌-శారద దంపతులు ఏడు నెలల వ్యవధిలోనే ఇద్దరూ మరణించడంతో వారి కుమార్తెలు అభినయ, ఆలయ అనాథలుగా మారారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంగళవారం ఎరడపల్లికి వెళ్లి చిన్నారులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముక్కుపచ్చలారని వయసులో చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోవడం తనను కలిచివేసిందన్నారు. వారి పోషణతో పాటు ఉన్నత చదువుల కోసం రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చేర్పించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో వారికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయిస్తానని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీలు లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్‌గౌడ్‌, సర్పంచ్‌ కలకుంట్ల రంజిత్‌రావు, ఎంపీటీసీ సంపత్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రదీప్‌రావు, మాజీ సర్పంచ్‌ సాగర్‌రావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గంట మహిపాల్‌, గ్రామాధ్యక్షుడు శేఖర్‌యాదవ్‌, సీనియర్‌ నాయకులు ఉమ్మెంతల సతీశ్‌రెడ్డి, చౌడమల్ల వీరస్వామి తదితరులున్నారు. 

అనాథ బాలికలకు ఆర్థిక సాయం

చిన్నారులు అభినయ, ఆలయను సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కె వీరస్వామి గౌడ్‌, నాయకులు పరామర్శించారు. సంఘం తరఫున రూ.55 వేల విలువైన చెక్కులను అందజేశారు. అలాగే సుల్తానాబాద్‌కు చెందిన అడ్డగుంట శ్రీనివాస్‌గౌడ్‌ రూ.5 వేల విలువైన చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల అధ్యక్షులు గణపతి రాజుగౌడ్‌, జాగిరి అంజిగౌడ్‌, ప్రధాన కార్యదర్శి బత్తిని వీరస్వామిగౌడ్‌, డివిజన్‌ అధ్యక్షుడు ఏ శ్రీనివాస్‌గౌడ్‌, ఎం శ్రీనివాస్‌గౌడ్‌, మండల నాయకులు పైడిపెల్లి పవన్‌కుమార్‌, శంకర్‌గౌడ్‌, అడ్డగుంట శ్రీనివాస్‌గౌడ్‌, సమ్మెట ప్రవీణ్‌గౌడ్‌, పైడిపల్లి రాజ్‌కుమార్‌, గుర్రం వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo