ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Aug 25, 2020 , 02:09:30

వైద్యులు సూచించిన మందులే వాడాలి

వైద్యులు సూచించిన మందులే వాడాలి

ఇంద్రవెల్లి : గ్రామాల్లోని ప్రజలు వైద్యులు సూచించిన మందులను సక్రమంగా వాడాలని ఐటీడీఏ పీవో భావేశ్‌మిశ్రా సూచించారు. మండలంలోని కెస్లాపూర్‌ నాగోబా దర్బార్‌ హాల్‌లో సోమవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. గిరిజన గ్రామాలకు చెందిన గర్భిణులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. సమయానికి అధికంగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. వైద్యులు ఇచ్చిన సూచనలతో పాటు సలహాలను తప్పకుండా పాటిస్తే రక్తహీనత ఉండదన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు ఇచ్చే మందులను సక్రమంగా వాడితేనే ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. రక్తహీనతను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి నిధులను మంజూరుచేస్తున్నాయని చెప్పారు. ఏజెన్సీలోని మండలాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను మరింతగా నిర్వహించి, గర్భిణులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. వాగులు దాటి గిరిజనులకు వైద్యం అందించిన వైద్యులతో పాటు సిబ్బందిని ఆయన అభినందించారు. అనంతరం ప్రత్యేక వైద్య శిబిరానికి తరలివచ్చిన గర్భిణులకు స్త్రీ వైద్య నిపుణుల ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడిమేత మనోహర్‌, స్త్రీ వైద్య నిపుణులు శశికళ, వైద్యులు సాహిత్య, సంతోష్‌, హరీశ్‌, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్‌, శ్రీనివాస్‌, జైవంత్‌రావ్‌, సర్పంచ్‌ మెస్రం రేణుకానాగ్‌నాథ్‌, గిరిజన పెద్దలు సిడాం భీమ్‌రావ్‌, తులసీరామ్‌పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.logo