మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Aug 24, 2020 , 01:49:12

పేకాట స్థావరాలపై దాడులు

పేకాట స్థావరాలపై దాడులు

గర్మిళ్ల : పట్టణంలోని పేకాటస్థావరంపై రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మెరుపు దాడి చేశారు.  అంతర్రాష్ట్ర జూదగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 2,00,250 నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో రామగుం డం సీపీ వీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. మంచిర్యాలలోని హైటెక్‌ సిటీ కాలనీలో గోనె విద్యాసాగర్‌ రావు ఇంట్లో పలువురు పేకాడుతున్నారనే సమాచారం మేరకు డీసీపీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, ఏసీపీ నరేందర్‌ ఆధ్వర్యంలో దాడి చేసినట్లు పేర్కొన్నారు. అన్నల తిరుపతి, ముంబత్తుల శంకర్‌, గుండపు లక్ష్మీనారాయణ, సేసు సాయికృష్ణ, నగావత్‌ రాజేశ్‌, మాదాడి రాజిరెడ్డి, వేల్పుల పోచంను  అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. గోనె విద్యాసాగర్‌ రావు, ఈ తిరుపతి, వీ మహేశ్‌ పరారైనట్లు తెలిపారు. గతంలో వీరిపై  భువనగిరిలో, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పేకాడుతూ పట్టుబడిన కేసులు కూడా ఉన్నాయన్నారు. దాడిలో పాల్గొన్న టాస్క్‌ ఫోర్స్‌ సీఐలు ఎం రాజ్‌కుమార్‌, టి కిరణ్‌ కుమార్‌, ఎస్‌ఐలు షేక్‌ మస్తాన్‌, సీహెచ్‌ కిరణ్‌, సిబ్బంది శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌, ప్రకాశ్‌, మల్లేశ్‌, మహేందర్‌, సదయ్య, భాస్కర్‌ గౌడ్‌, శ్యామ్‌సుందర్‌, సంపత్‌, రాకేశ్‌, వెంకటేశ్వర్లు, ఎ శ్రీనివాస్‌, సునీల్‌, హోం గార్డులు కృష్ణ, సుదర్శన్‌ను సీపీ అభినందించారు.

పీడీ యాక్ట్‌ నమోదు చేస్తాం : సీపీ

అంతర్రాష్ట్ర పేకాట ముఠా (జంగ్లీ జూదగాళ్లు )లోని ప్రధా న సూత్రదారులు ముంబత్తుల శంకర్‌ (మేకల మండి శంకర్‌), అన్నల తిరుపతిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయనున్నట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. వీరిద్దరూ తెలంగాణ, మహారాష్ట్రలోని అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేకా ట స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని, వీరి వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోయారన్నారు. వీరిపై పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెప్పారు. వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పీడీ యాక్ట్‌ అమలు చేస్తామని తెలిపారు.  

పేకాట రాయుళ్లఅరెస్ట్‌

మంచిర్యాలోని ఇస్లాంపురలో ఓ ఇంట్లో పేకాడుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. ఏడుగురిని  అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.70,500 నగదును, ఏడు సెల్‌ ఫోన్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఎడ్ల మల్లేశ్‌, నార్ల తిరుపతి, సయ్యద్‌ సిరాజ్‌, అనంతుల లక్ష్మణ్‌, కాత్రె గణేశ్‌, బోయిన మహేందర్‌, కైమా సాగర్‌ ఉన్నారు. తదుపరి విచారణ కోసం మంచిర్యాల పట్టణ పోలీసు స్టేషన్‌కు వారిని తరలించి కేసు నమోదు చేశారు.  

ఎదులాపురం : ఆదిలాబాద్‌లోని అటెండర్‌ కాలనీలో పేకాడుతున్న 9 మందిని అరెస్టు చేసినట్లు  టాస్క్‌ఫోర్స్‌ సీఐ ఈ చంద్రమౌళి తెలిపారు. శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో  పేకాడుడుతున్నట్లు అందిన సమాచారం మేరకు  వన్‌టౌన్‌ ఎస్‌ఐ జీ  అప్పారావుతో కలిసి దాడిచేసినట్లు పేర్కొన్నారు. 9 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పట్టుబడిన వారిలో శౌటివార్‌ రమేశ్‌, గుమ్ముల అనిల్‌, ఆడే రాజు, గుమ్ముల నితిన్‌, ఎల్లవార్‌ రాకేష్‌, ధర్మయ్య రాకేశ్‌,  మర్రి పూర్ణచందర్‌, ఎంబొడె శేఖర్‌, సోమ శ్రీనివాస్‌ ఉన్నారు. దాడిలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఎస్‌కే తాజొద్దీన్‌, ఠాకూర్‌ జగన్‌ సింగ్‌, హనుమంతరావు, పెందూర్‌ రాము, 


logo