బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Aug 22, 2020 , 00:12:15

మట్టి గణపతే మేలు..

మట్టి గణపతే మేలు..

తాండూర్‌: పర్యావరణ హితం కోసం మట్టి గణపతే మేలని ఎస్‌ఐ శేఖర్‌ రెడ్డి అన్నారు. జై గణేశ్‌ భక్తి సమితి, అభినవ స్వచ్ఛంద సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఐబీలో మట్టి గణపతి విగ్రహాలను ఆయన చేతుల మీదుగా శుక్రవారం అం దజేశారు. అభినవ సేవా సంస్థ సభ్యులు ఏ ముర్ల ప్రవీణ్‌, కొండ చరణ్‌ రాజ్‌, ప్రదీప్‌, కిర ణ్‌, కుమార్‌, శ్రీనివాస్‌, ఆకాశ్‌, కల్పన, రమే శ్‌, రవికిరణ్‌, వేణగోపాల్‌, భాస్కర్‌, తదిత రులు ఉన్నారు.

ఇండ్లలో నిర్వహించుకోవాలి

బెల్లంపల్లి టౌన్‌: వినాయక చవితి, మొహ ర్రం ఉత్సవాలను ఇండ్లలోనే నిర్వహించుకోవాలని వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌వో రాజు తెలిపారు.  పోలీస్‌ స్టేషన్‌లో గణపతి, మొహర్రం ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి సూ చనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే  చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. 

భీమారం: మండల కేంద్రంలోని పోలీస్‌ స్టే షన్‌లో గణేశ్‌ ఉత్సవ నిర్వాహకులు, ముస్లింలతో ఎస్‌ఐ సంజీవ్‌ సమావేశం నిర్వహించారు. చవితి, మొహర్రం వేడుకలకు అనుమతి లేదని ఆయన అన్నారు. 

జైపూర్‌: శ్రీరాంపూర్‌ సీఐ బిల్లా కోటేశ్వర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సమావేశం నిర్వహించి సూ చనలు చేశారు. ఎస్‌ఐ రామకృష్ణ, రెండో ఎస్‌ఐ రాజాగౌడ్‌, సిబ్బంది శ్రీనివాస్‌, చంద్రమోహ న్‌, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

లక్షెట్టిపేట రూరల్‌: ఇండ్లలోనే చవితి వేడుక లు నిర్వహించుకోవాలని లక్షెట్టిపేట ఎస్‌ఐ దత్తాద్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

మంచిర్యాల టౌన్‌ (శ్రీరాంపూర్‌): నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఇసంపెల్లి ప్రభాకర్‌తో కలిసి పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశం లో సీఐ కోటేశ్వర్‌ పలు సూచనలు చేశారు.

మట్టి విగ్రహాల పంపిణీ

మందమర్రి: సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో సీఈఆర్‌ క్లబ్‌లో మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌ మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడు తూ రసాయన విగ్రహాలతో పర్యావరణం కలు షితం అవుతుందని చెప్పారు. పర్సనల్‌ మేనేజర్‌ ఎస్‌ వరప్రసాద్‌, ఏజీఎం ఏరియా ఇంజినీర్‌ జగన్మోహన్‌రావు, డీజీఎం రామ్మోహన్‌, సేప్టీ ఆఫీసర్‌ ఓదెలు, టీబీజీకేఎస్‌ స్ట్రక్చర్‌ కమిటీ సభ్యుడు శంకర్‌రావు, డీవై పీఎం రెడ్డిమల్ల తిరుపతి పాల్గొన్నారు.

మంచిర్యాల టౌన్‌ (శ్రీరాంపూర్‌): శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ శ్రీరాంపూర్‌ కాలనీ సేవా భవన్‌లో మ ట్టి విగ్రహాలను కార్మికుల కుటుంబాలకు పం పిణీ చేశారు. మట్టి గణపతులనే కొలవాలన్నా రు. టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, ఎస్‌ వోటూ జీఎం కుమారస్వామి, డీవైజీఎం ని కోలస్‌, అమరేందర్‌రెడ్డి, క్వాలిటీ డీవైజీఎం నూక రమేశ్‌, డీవైపీఎం తుకారాం, సింగరేణి సేవా సమితి కార్యదర్శి కొట్టె జ్యోతి, సహాయ కార్యదర్శి రత్నకళ పాల్గొన్నారు. 


logo