బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - Aug 21, 2020 , 02:14:45

రోజూ 1850

రోజూ 1850

  • n ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షల పెంపు 
  • n మారుమూల గ్రామాలకు రెండు మొబైల్‌ వాహనాలు
  • n ప్రతి కేంద్రానికీ ల్యాబ్‌ ఇన్‌చార్జిలు
  • n వైద్యారోగ్య శాఖ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో కరోనా కేసులు పె రుగుతున్న నేపథ్యంలో నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో ఇప్పటివరకు 848 పాజి టివ్‌ కేసులు నమోదు కాగా, 347 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 488 మంది పూర్తిగా కోలుకున్నారు. పట్టణాలతో పాటు పల్లెలకూ కరోనా విస్తరించగా, పీహెచ్‌సీల్లో యాంటీజ న్‌ కిట్ల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. రిమ్స్‌తో పాటు పీహెచ్‌సీల్లో రోజూ 300 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు పరీక్షలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సి క్తా పట్నాయక్‌ వైద్యశాఖ అధికారులు గురువారం సమావేశం నిర్వహించి, రోజుకు 1850 మందికి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. కమ్యూనిటీ దవాఖానలు, ప్రాథమిక, పట్టణ ఆరో గ్య కేంద్రాల్లో రోజుకు 50 చొప్పున, రిమ్స్‌ దవాఖానలో 200, రిమ్స్‌ కళాశాలలో 200 పరీక్షలు చేయాలని సూచించారు. ప్రతి కేంద్రానికీ ల్యాబ్‌ ఇన్‌చార్జిని నియమించాలని కోరారు. పాజిటివ్‌ వచ్చిన వారు హోం ఐసొలేషన్‌లో ఉండేలా ప్రోత్సహిస్తుండగా, సౌకర్యాలు లేని వారికి  దవాఖానల్లో చికిత్సలు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సెలవు రోజుల్లో కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. రోజూ సాయంత్రం పరీక్షా  ఫలితాలను రాష్ట్ర స్థాయి అధికారులకు అందజేస్తారు.

మొబైల్‌ బృందాల ఏర్పాటు

జిల్లాలో కరోనా టెస్ట్‌లను వేగవంతం చేసేందుకు అధికారులు రెండు మొబైల్‌ వాహనాలను సిద్ధం చేశారు. పట్టణాల్లో ని స్లమ్‌ ఏరియాల్లో మారుమూలు గ్రామాలతో పాటు ఏజెన్సీలోని గిరిజన గూడేల్లో వీటి ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. పట్టణంలోని కుర్షీద్‌ నగర్‌లో 25 మందికి మొబైల్‌ బృందం గురువారం పరీక్షలు చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు, గ్రామ పంచాయతీల్లో కూడా వైద్యసిబ్బంది ప్రజలకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గ్రామ పంచాయతీల్లో పరీక్షలు చేస్తారు. అనుమానితులు, వ్యాధి లక్షణాలు కాకుండా, రిస్క్‌ ఎక్కువగా ఉ న్న వారందరికీ పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు.

కరోనా నివారణకు పటిష్టమైన చర్యలు

జిల్లాలో కరోనా నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటు న్నాం. ఇందులో భాగంగా వ్యా ధి నిర్ధారణ పరీక్షలు పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరో గ్య కేంద్రాలు ఒక్కోదానిలో రో జూ 50 పరీక్షలు చేసేలా ఏర్పా ట్లు చేశాం. ఆయా పీహెచ్‌సీల ప రిధిలో సిబ్బంది దవాఖానల్లో కాకుండా గ్రామ పంచాయతీ ల్లో కూడా హై రిస్క్‌ ఎక్కువగా ఉన్న వారికి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. మొబైల్‌ వాహనాల ద్వారా కూడా ఇప్పటికే పరీక్షలు చేస్తున్నాం. పాజిటివ్‌ కేసులకు మెరుగైన చికిత్సలు అందిస్తున్నాం.  అన్ని ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేశాం.

- నరేందర్‌ రాథోడ్‌, జిల్లా వైద్యాధికారి


logo