శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Aug 21, 2020 , 02:14:49

ప్రముఖులకు విత్తన గణపతుల పంపిణీ

ప్రముఖులకు విత్తన గణపతుల పంపిణీ

మంచిర్యాలటౌన్‌ : గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పిలుపు మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు గురువారం మంచిర్యాల పట్టణంలోని పలువురు ప్రముఖులకు విత్తన గణపతులను టీఆర్‌ఎస్‌ నాయకుల ద్వారా అందించారు. విత్తన గణపతి చాలెంజ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. అందించిన విత్తన గణపతులను పూజ అనంతరం విమజ్జనం చేయగా.. విత్తనం ద్వారా మొక్క మొలకెత్తుతుందని, 15 రోజుల తర్వాత బుట్టతోసహా మొక్కను ఇంటి ఆవరణలో నా టాలని, ఆ మొక్క పెరిగి పెద్దగయ్యాక వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుందన్నారు. ఎమ్మెల్యే ద్వారా విత్తన గణపతులను అందుకున్న ప్రముఖుల్లో మం చిర్యాల ఆర్డీవో రమేశ్‌, పట్టణ సీఐ ముత్తి లింగయ్య, ప్రముఖ వ్యాపారి గుండా సుధాకర్‌, తహసీల్దార్‌ రాజేశ్వ ర్‌, తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే తరఫున విత్తన గణపతులను అందించిన నాయకుల్లో సుదమల్ల అశోక్‌తేజ, పూసల వెంకన్న, కర్రు శం కర్‌, ప్రశాంత్‌ రెణ్వా, ఓలం రాజ్‌కుమార్‌, వెంకటసాయి, తదితరులు ఉన్నారు.