బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Aug 20, 2020 , 03:34:28

మరో మూడు కేంద్రాలు..

మరో మూడు కేంద్రాలు..

  • n ఇప్పటికే బెల్లంపల్లిలో ఐసొలేషన్‌ సెంటర్‌
  • n చెర్నూర్‌, మంచిర్యాల, మందమర్రిలో కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : జిల్లాలో ప్రస్తు తం బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా దవాఖానను ఐసొలేషన్‌ కేంద్రంగా వాడుకుంటున్నారు. అక్కడ 70 పడకల కేంద్రం ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా కేసులు పెరుగుతుండడంతో, ఈ కేం ద్రంపై ఒత్తిడి పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని చోట్ల కేంద్రాలు నిర్వహించాలని నిర్ణ యం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయగా, కలెక్టర్‌ ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో జిల్లా వ్యా ప్తంగా కొత్తగా మూడు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.  ఈవిషయమై ఇప్పటికే విప్‌ బాల్క సుమన్‌, కలెక్టర్‌ భారతీ హోళికేరితో చర్చించారు.

చెన్నూరు, మందమర్రి, మంచిర్యాలలో..

జిల్లావ్యాప్తంగా మూడు ఐసొలేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేయనుండగా.. ఇందులో ఒకటి చెన్నూరు, మరొటి మందమర్రి, ఇంకొటి మంచిర్యాలలో ఏర్పాటు చేస్తున్నారు. చెన్నూరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ఆర్డీవో రమేశ్‌ పాఠశాలను సందర్శించారు. ఇక్కడ 50 పడకలతో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది పూర్తయితే కోటపల్లి, చెన్నూరు, భీమారం, జైపూర్‌ మండలాల్లో ని కరోనా బాధితులకు ఇక్కడే చికిత్స అందించే వీలుంటుంది. చెన్నూర్‌లోని ఎల్లక్కపేట సింగరేణి క్వార్టర్లను కూడా పరిశీలించారు. ఇక మందమర్రిలో కూడా 70 పడకలతో ఐసొలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం కేం ద్రాన్ని సిద్ధం చేసే పనిలో అధికారులున్నారు. జి ల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఎఫ్‌సీఏ ఫంక్షన్‌ హాల్‌, హైటెక్‌ సిటీ క్లబ్‌తో పాటు, మోడల్‌ పాఠశాలను పరిశీలించారు. 

 త్వరలోనే ప్రారంభం..

చెన్నూరులో ఇప్పటికిప్పుడు కేంద్రాన్ని  ప్రారంభించేందుకు అన్ని రకాలుగా సిద్ధం చేశారు. పాఠశాల గదులను శుభ్రం చేసి బెడ్లను కూడా సిద్ధం చేశారు. కరోనా బాధితులకు చికిత్స అందిచేందు కు వైద్య పరికరాలను కూడా సమకూర్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రోగులకు భోజ న వసతి కల్పించేందుకు కూడా ప్రణాళికలు సి ద్ధం చేశారు. ఇక మంచిర్యాల హైటెక్‌ సిటీ క్లబ్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నట్లు అధికారులు గుర్తించా రు. ప్రత్యేకంగా గదులు, ఇతర సదుపాయాలు కూడాఉన్నాయని తెలిపారు. అదే సమయంలో తెలంగాణ మోడల్‌ పాఠశాలలో కూడా అన్ని వసతులు ఉన్నట్లు వెల్లడించారు. అయితే, ఇళ్ల మధ్యలో ప్రజల నుంచి వ్యతిరేకత  వస్తున్న నేపథ్యంలో, ఊరికి దూరంగా ఉండేలా  చూడాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో తెలంగాణ మోడల్‌ పాఠశాలపై దృష్టి సారించారు. మరో రెండు, మూడు రోజుల్లో వీటిని ప్రారంభించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. logo