బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Aug 19, 2020 , 02:43:22

ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి

ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి

మందమర్రి : కొత్తగా ఉద్యోగాలు పొందిన వారంతా ఉద్యోగ ధర్మాన్ని పాటించి సింగరేణి అభివృద్ధికి తోడ్పడాలని మందమర్రి ఏరియా జనరల్‌ మేనేజర్‌ చింతల శ్రీనివాస్‌ కోరారు. మంగళవారం మందమర్రిలోని జనరల్‌ మేనేజర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో 32 మంది డిపెండెంట్లకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఏరియా ఇంజినీర్‌ జగన్‌మోహన్‌రావు, పర్సనల్‌ మేనేజర్‌ వరప్రసాద్‌, సీఎంవోఏ అధ్యక్షుడు జక్కారెడ్డి, డీవైపీఎం శ్యాంసుందర్‌, డివైపీఎం రెడ్డిమల్ల తిరుపతి, టీబీజీకేఎస్‌ స్ట్రక్చర్‌ కమిటీ సభ్యుడు సీవీ.రమణ, ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. 


logo