శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Aug 19, 2020 , 02:43:25

స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి

స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి

  • n  ఎమ్మెల్యే కోనప్ప,  మున్సిపల్‌ చైర్మన్‌ హుస్సేన్‌
  • n  మూడు చెత్త తరలింపు వాహనాల  ప్రారంభం 

కాగజ్‌నగర్‌ టౌన్‌ : కాగజ్‌నగర్‌ను స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కోనప్ప అన్నారు. మున్సిపల్‌ కా ర్యాలయంలో చైర్మన్‌, కమిషనర్‌తో కలిసి మంగళవారం చెత్త తరలింపు వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీకి 14 మంజూరు కాగా ప్రస్తుతం మూడు వాహనాలు వచ్చాయన్నారు. అంతకుముందు మున్సిపల్‌ చైర్మన్‌ స ద్దాం హుస్సేన్‌, కమిషనర్‌ శ్రీనివాస్‌ వాహనాలకు పూజ చేశారు. ము న్సిపల్‌ డీఈ గోపాల్‌, ఏఈ సతీశ్‌, టీపీఎస్‌ అశోక్‌,  అధికారులు క్రాం తి, సతీశ్‌, రఫిక్‌, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

వీధి వ్యాపారులకు చెక్కుల పంపిణీ

పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో వీధి వ్యాపారులకు రుణా మేళా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోనప్ప హాజరై చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10వేల రుణాన్ని అందజేస్తున్నాయన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, డీఈ గోపాల్‌, ఏఈ సతీశ్‌, టీపీఎస్‌ అశోక్‌  ఉన్నారు.