గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Aug 18, 2020 , 02:59:02

సీఐ, ఎస్‌ఐ పనితీరు భేష్‌

సీఐ, ఎస్‌ఐ పనితీరు భేష్‌

కోటపల్లి  :  చెన్నూర్‌ రూరల్‌ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్‌ఐ  రవికుమార్‌ పనితీరు భేష్‌ అని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌, సీసీ సత్యనారాయణ అన్నారు. మండలంలోని సిర్సాకు చెందిన గర్భిణి ప్రసవ వేదనకు గురికాగా సమాచారం అందుకున్న సీఐ, ఎస్‌ఐ ఆమెను తుంతుంగ నీటి ప్రవాహాన్ని దాటించడం అభినందనీయనమని అన్నారు. అత్యవసర సమయంలో ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీస్‌ అధికారులు గుర్తింపు తెచ్చుకున్నారని వారిని అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి సురేఖ, తహసీల్దార్‌ రామచంద్రయ్య,ఎంపీడీవో భాస్కర్‌, ఎంపీటీసీలు జేక శేఖర్‌, మారిశెట్టి తిరుపతి, సర్పంచ్‌లు దాగామ రాజు, నిర్మల, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బైస ప్రభాకర్‌, యూత్‌ అధ్యక్షుడు మారిశెట్టి విద్యాసాగర్‌,నాయకులు ముల్క ల్ల శశిపాల్‌ రెడ్డి, మంత్రి రామయ్య, పెద్దింటి పున్నంచంద్‌, గొడిశెల రాజేశ్వర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాలతో ప్రాణహిత, గోదావరి నదులు ఉప్పొంగుతున్నందున పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ సూచించారు. మండలంలోని రాపనపల్లి సమీపంలోని ప్రాణహిత నది ప్రవాహాన్ని, ఎదుల్లబంధం వద్ద తుంతుంగ చెరువు మత్తడి నీటి ప్రవాహాన్ని సీపీ సత్యనారాయణ, డీసీపీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, జైపూర్‌ ఏసీపీ నరేందర్‌  పరిశీలించారు. వారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా పోలీస్‌శాఖ  ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని సీపీ తెలిపారు. చేపల వేటకు  వెళ్లకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నదుల్లో పడవ ప్రయాణాలను పూర్తిగా నిలిపివేసినట్లు వెల్లడించారు. వర్షాలకు ఇంటి గోడలు నాని కూలిపోయే ప్రమాదం ఉన్నందున, ఈ విషయంపై గ్రామాల్లో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర సమయంలో ఆదుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే డయల్‌ 100 కి కాల్‌ చేయాలన్నారు.   


logo