బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Aug 18, 2020 , 02:59:03

ఉన్నత స్థాయికి ఎదగాలి

ఉన్నత స్థాయికి ఎదగాలి

  • n సింగరేణి సీఅండ్‌ఎండీ శ్రీధర్‌
  • n సివిల్స్‌ ర్యాంకర్‌ సంకీర్త్‌కు సన్మానం 

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : సివిల్స్‌లో 330 ర్యాంక్‌ సాధించిన సంకీర్త్‌ మాదిరిగానే ఇత ర సింగరేణి కార్మికుల పిల్లలు మంచి పట్టుదల, కృషితో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సింగరేణి సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సివిల్స్‌లో 330 ర్యాం క్‌ సాధించిన సంకీర్త్‌ను ఆయన సోమవారం ఘ నంగా సన్మానించారు. బెల్లంపల్లి ఏరియా ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న సంకీర్త్‌ తండ్రి సత్యనారాయణ, తల్లి అనితను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. సివిల్స్‌లో తాను ర్యాంకు సాధించడానికి చేసిన కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, పరోక్షంగా సింగరేణి సహకారాన్ని సీఅండ్‌ఎండీకి సంకీర్త్‌ వివరించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ తమ పిల్లల చదువులపై సింగరేణి కార్మికుల దృక్పథం మారిందన్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు తమ పిల్లలను ఉన్నత చదువుల వైపు ప్రోత్సహిస్తున్నారని, ఇది శుభపరిణామమని తెలిపారు. అనేక మంది కార్మికుల పిల్లలు విదేశాల్లోనూ, హైదరాబాద్‌లోని పలు కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పనిచేయడం అభినందనీయమన్నారు. కోల్‌ ఇండియా వంటి కంపెనీలో కూడా సింగరేణి పిల్లలు పనిచేస్తున్నారని, సింగరేణి ఉద్యోగులంటే అక్కడ కూడా మం చి గౌరవం, విలువ ఉందని పేర్కొన్నారు. సంకీర్త్‌ తల్లిదండ్రుల కృషిని అభినందిస్తూ ఇతర కార్మికులు, ఉద్యోగులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. 

 సింగరేణి తల్లితో సమానం : సంకీర్త్‌ 

 సింగరేణి సంస్థలో తన తండ్రి ఉద్యోగం చేయ డం వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని, సిం గరేణి తల్లితో సమానమని సంకీర్త్‌ పేర్కొన్నారు. సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ కంపెనీ వ్యాప్తంగా తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలను తన కెరీర్‌లో ఒక స్ఫూర్తిగా తీసుకుంటానని తెలిపారు. ఒకవేళ తన కెరీర్‌లో సింగరేణిలో పని చేసే అవకాశం ఏ హోదాలో వచ్చినా అది గొప్ప అదృష్టంగా భావిస్తానన్నారు. సింగరేణి తల్లి రుణం తీర్చుకునే భాగ్యంగా భావించి సంస్థకు సింగరేణి కార్మికులకు సేవలందిస్తానని సంకీర్త్‌ తెలిపారు. 


logo