శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Aug 17, 2020 , 01:05:53

స్వచ్ఛ మున్సిపాలిటీ దిశగా..

స్వచ్ఛ మున్సిపాలిటీ దిశగా..

మంచిర్యాల, నమస్తే తెలంగాణ: జిల్లాలోని మున్సిపాలిటీలను స్వచ్ఛ మున్సిపాలిటీలుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. బ హిరంగ మల, మూత్ర విసర్జన రహిత పట్టణాలుగా మార్చాలని ప్రణాళికలు రూపొందించిం ది. దీంతో అన్ని మున్సిపాలిటీల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రతి వెయ్యి మందికి కనీ సం ఒక మరుగుదొడ్డి ఉండాలని మంత్రి కేటీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం లో జిల్లాలో సామూహిక మరుగుదొడ్ల నిర్మా ణం జోరుగా సాగుతున్నది. 

రద్దీ ఎక్కువగా ఉండే ముఖ్య ప్రదేశాలు, చౌరస్తాలను ఎంపిక చేసి ఏజెన్సీల ద్వారా మ రుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో  వీటిని నిర్మించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

స్థలాలను గుర్తించి..

జిల్లాలో చెన్నూర్‌, లక్షెట్టిపేట, నస్పూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీలు ఉన్నాయి. చెన్నూర్‌లో మూడు ప్రాంతాల్లో లక్షెట్టిపేటలో రెండు ప్రాం తాల్లో, నస్పూర్‌లో ఒక చోట, బెల్లంపల్లిలో రెండు, మంచిర్యాలలో నాలుగు చోట్ల స్థలా లను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టాలని అధికారులు ఆదేశించడంతో పను లు చురుకుగా కొనసాగుతున్నాయి. మంచిర్యాల పట్టణంలో రెండు మొబైల్‌ టాయిలెట్ల నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులను అందుకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు.  

ఓడీఎఫ్‌గా చేసేందుకు

జిల్లాలో ఉన్న ఏడు మున్సిపాలిటీలు బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత నగరాలు గా (ఓడీఎఫ్‌) మార్చేందుకు ఇప్పటికే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టింది. కేంద్రం ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాల్లో కూడా టాయిలెట్లకు ప్రాధాన్యమిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్‌ భారతీ హోళికేరి పనులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ప్రతి మున్సిపల్‌ పరిధిలో నిర్మించే మరు గుదొడ్లలో తప్పనిసరిగా 50 శాతం మహిళలకే కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేశారు. 


logo