బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Aug 16, 2020 , 01:57:23

వాన.. వరద

వాన.. వరద

  • n కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో ఎడతెరిపిలేని వానలు
  • n పొంగిపొర్లుతున్న వాగులు.. వంకలు
  • n ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్‌ఫ్లో
  • n మత్తళ్లు దుంకుతున్న చెరువులు
  • n పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • n ఓపెన్‌కాస్టుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
  • n అక్కడక్కడా కూలిన ఇండ్లు

మంచిర్యాల, నమస్తే తెలంగాణ: జిల్లా వ్యాప్తంగా ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు ఉ ప్పొంగి ప్రవహిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. జిల్లాలో పదిహేను రోజుల్లో 692 మిల్లీ మీటర్ల వర్షపాతం కురియాల్సి ఉండగా, 649.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఒక్క శనివారమే 16 మిల్లీ మీటర్లుగా నమోదైంది. కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోగా, ఓపెన్‌కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

649 మిల్లీ మీటర్ల వర్షపాతం

జిల్లాలో 15 రోజుల్లో 649.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక మండలంలో అత్యధికం, 14 మండలాల్లో సాధారణం, మూడు మండలాల్లో తక్కువ వర్షపాతం న మోదైంది. తాండూరు మండలంలో 33 శా తం అధికంగా పడింది.  శనివారం 10.7 మి ల్లీమీటర్ల వర్షపాతం కురియాల్సి ఉండగా, 16.1 మిల్లీమీటర్లుగా నమోదైనట్లు అధికారు లు చెప్పారు. మరో రెండు రోజుల పాటు వర్షం ఉంటుందని వాతావరణ శాఖ అధికారుల చెప్తున్నారు. 

పొంగుతున్న వాగులు, వంకలు

జిల్లాలో అన్ని చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేమపల్లి మండలంలో నీల్వా యి ప్రాజెక్టు రెండు రోజులుగా మత్తడి దుంకుతుంది. కాసిపేట వాగు ఉధృతంగా ప్రవహించడంతో మామిడిగూడకు, రాళ్లవాగు ఉప్పొంగడంతో గురువారపూర్‌ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నూర్‌లో కుంటలు, చెరువులు నిండుగా, కత్తెరశాల వాగు పొంగి పొర్లుతున్నది. తుంతుంగా ప్రాజె క్టు కూడా అలుగు పారుతుంది. కోటపల్లి మం డలంలో కూడా చెరువులు కుంటలు నిండా యి. మరో రెండు రోజులు వర్షాలు పడితే మం చిర్యాల, చెన్నూర్‌, లక్షెట్టిపేట, శ్రీరాంపూర్‌  లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయ ని ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

ఉప్పొంగిన గోదావరి, ప్రాణహిత

గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్ర వహిస్తున్నాయి. కోటపల్లి, వేమనపల్లి ప్రాంతా ల్లో ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వానలకు ప్రాణహితకు వరద పోటెత్తుతున్నది. నారాయణపూర్‌, చెన్నూర్‌, చింతలపల్లి వద్ద గోదావరి ఉప్పొం గి ప్రవహిస్తోంది. 

నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓపెన్‌ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మందమర్రి ఓపెన్‌కాస్టులో ఓవర్‌బర్డెన్‌ వెలికితీత పనులకు కూడా అంతరాయం కలిగింది. కళ్యాణి ఖని ఓపెన్‌కాస్టులో దాదాపు 3వేల టన్నులు, శ్రీరాంపూర్‌ ఓపెన్‌కాస్టులో 122 వేల టన్నుల ఉత్పత్తి నిలిచిపోయింది. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో ఓవైపు అండర్‌గ్రౌండ్‌ గనుల్లో ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోగా వర్షాల ప్రభావంతో ఓపెన్‌కాస్టుల్లో కూడా ఉత్పత్తి ఆగిపోయింది. 

కోటపల్లి: ఎదుల్లబందం గ్రామానికి చెందిన గి రిజనుడు జేక ముత్యాలు ఇల్లు కూలింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా గోడ పడిపోయినట్లు బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని కో రుతున్నాడు. కూలిన ఇంటిని ఎంపీటీసీ జేక శేఖర్‌ పరిశీలించి పరహారం వచ్చేలా చూస్తానని చెప్పారు. 

పెంచికల్‌ పేట: పెద్దవాగులో భారీగా నీరు చేరడంతో నిండుకుండను తలపిస్తున్నది.  మండలంలోని అన్ని గ్రామాల్లో ఒర్రెలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎల్లూ ర్‌ గ్రామంలోని పంట పొలాల్లో భారీగా నీరు చేరింది. బొక్కివాగు ప్రాజెక్టు అలుగు దుంకుతుంది. సాగు పనులకు మేరగూడ వెళ్లిన రైతు లు ఇబ్బంది పడ్డారు. 

వేమనపల్లి: నీల్వాయి ప్రాజెక్టు మత్తడి దుం కుతుంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండకుండను తలపిస్తున్నది. వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఇరు వైపులా అప్రోచ్‌ రోడ్డు వే యకపోవడంతో చెన్నూర్‌, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 

కోటపల్లి: ఎడతెరిపి లేని వర్షంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువుల్లోకి  భారీగా వరద చేరడంతో మత్తళ్లు దుంకుతున్నాయి. తుంతుంగా చెరువు మత్తడితో రాకపోకలను అంతరాయం ఏర్పడింది. కోటపల్లి వద్ద ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తున్నది. 

చింతలమానేపల్లి: మండలంలోని దిందా-కేతిని వాగు, రవీంద్రనగర్‌-బాలాజీఅన్‌కోడ ఒర్రెతోపాటు రణవెల్లి సమీపంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడింది. పంట పొలాల్లో నీరు చేరి నష్టం ఏర్పడిందని రైతులు ఆందోళన చెం దుతున్నారు. మండలంలోని బూరెపల్లికి చెందిన బొర్కుటె తారాబాయి ఇంటిగోడ కూలింది. 

చెన్నూర్‌ రూరల్‌: మండలంలోని సుద్దాల వాగులోకి భారీగా వరద చేరడంతో వాగు మీద ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాగాపూర్‌, అస్నాద్‌ గ్రామాల్లోని పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇటు సుబ్బరాంపల్లి వద్ద ఉన్న వాగు మీద తాత్కాలిక వంతెన తెగడంతో నారాయణపురం, రాగిపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుద్దారం, సంకారం గ్రామాల్లో ని ఒర్రెలు పొంగి పొర్లుతున్నాయి. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి

మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌): కురు స్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రానున్న రెండు రోజు లు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సాయం కోసం 08736-250501 కు ఫోన్‌ చేయాలని ఆమె సూచించారు. 


logo