గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Aug 15, 2020 , 03:42:48

ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం

ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం

  • n ఈజీఎస్‌ ద్వారా రాష్ట్ర సర్కారు చేయూత
  • n కూరగాయలు, పండ్ల తోటలకు ఉపాధి నిధులు
  • n జిల్లాలో 10,021 ఎకరాల్లో కూరగాయలు, 1400 ఎకరాల్లో పండ్ల తోటలు 
  • n క్రమంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
  • n రైతులకు లబ్ధి.. కూలీలకు ఉపాధి

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఎక్కువగా రైతులు పత్తి, కంది, సోయాబీన్‌ పంటలను సాగు చేస్తుంటారు. కాగా, ఇటీవల ఉద్యానవన, కూరగాయల పంటలపై కూడా దృష్టి పెట్టారు. వాణిజ్య పంటల కాలవ్యవధి ఎక్కువగా ఉండడం వాతావరణ పరిస్థితులు, చీడ, పీడల బెడదతో ప్రత్యామ్యాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో జామ, మామిడి, తర్బూజా, కర్బూజా, జామ, దాని మ్మ, సపోట, తదితర ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నారు. వీటితో పాటు జిల్లా వ్యా ప్తంగా టమాటా, వంకాయ, కాకర, బీరకా య, అలసంద, తదితర కూరగాయలు సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 10,021 ఎకరాల్లో కూరగాయ పంటలు, 1400 ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. డిమాండ్‌కు సరిపడా పండ్లు, కూరగాయల ఉత్పత్తి లేకపోవడంతో వీటి ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. హైదరాబాద్‌, నిజామాబాద్‌, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు పండ్లు, కూరగాయలను జిల్లాకు తీసుకువచ్చి విక్రయిస్తారు. కాగా, ఇప్పటికే ఉపాధి హామీ పథకం లో కూరగాయల పంటల సాగుకు ప్రోత్సా హం లభిస్తున్నది. దీంతో పాటు పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులకూ చేయూతనందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసింది. 

పలు రకాల ప్రయోజనాలు

ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యానవన పంటలు, కూరగాయలు సాగుచేసే రైతుల భూముల్లో పలు రకాల పనులు చేపడుతారు. రైతులకు పలు రాయితీలు లభించడంతో పాటు కూలీలకు ఉపాధి లభించనుం ది. ఉపాధి నిధుల నుంచి రైతులకు మూడేళ్ల పాటు నిర్వహణ ఖర్చులు కూడా చెల్లిస్తారు. తీగజాతి కూరగాయలైన కాకర, బీర, సొరకాయ లాంటి వాటికి పందిళ్ల అవసరం ఉం టుంది. పందిరి సాగు ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఎక్కువ మంది టమాట, వం కాయ, గోబి, అలసంద లాంటి పంటలు పం డిస్తున్నారు. జాబ్‌కార్డులు కలిగిన రైతులు పం దిరి సాగు చేసుకునేందుకు అవసరమైన నిధు లు మంజూరు చేస్తున్నారు. గుంతలు, తవ్వ డం, ఫిల్లర్లు పాతడం, వైర్లు ఏర్పాటు చేసుకోవడం, ఇతర పనులు చేపడుతారు.

పండ్ల తోటలకు ప్రోత్సాహం

పండ్లతోటలను సాగు చేసే రైతులకు ఉపాధి హామీ ద్వారా ప్రోత్సాహం లభించనుంది. వివి ధ రకాల పండ్లకు సంబంధించిన మొక్కలతో పాటు గుంతలు తవ్వడంతో పాటు అవసరమైన పరికరాలను సబ్సిడీపై ఇస్తారు. తోటల పెంపకంలో భాగంగా నిర్వహణ ఖర్చులను చెల్లిస్తారు. ఇందుకు సంబంధించిన ఖర్చులను ఆన్‌లైన్‌లో జనరేట్‌ చేయాల్సి ఉంటుంది. వీ టితో పాటు శ్రీగంధం, వెదురు సాగుచేసే రైతులకు కూడా ఉపాధి హామీలో భాగంగా ప్రో త్సాహకాలను అందిస్తారు. పండ్లతోటలు, శ్రీ గంధం, మలబార్‌, వెదురు పంటలకు రైతులు జాబ్‌కార్డులు కలిగిన వారికి గుంతలు తీయించుకోవచ్చు. వీటికి కావాల్సిన ఖర్చు ఉపాధి హామీ ద్వారా జనరేట్‌ చేస్తారు. ఉపాధిహామీ పథకాన్ని ఉద్యానవన పంటలకు అనుసంధా నం చేయడంతో ఈ పంటల సాగు విస్తీర్ణం కూడా పెరగనుంది.

పండ్ల తోటలు సాగుచేయాలి

ఉపాధి హామీకి అనుసంధానంతో జిల్లాలో పండ్లతోటలు సాగు చేసే రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో భాగంగా ల బ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. సాగుకు సంబంధించిన అంచ నా జనరేట్‌ అయిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. ఇతర పంటలకు సాగుచేసే రైతులు ప్రత్యామ్నాయంగా తోటల పంటలను సాగు చేస్తే లాభం ఉంటుంది. జామ, నిమ్మ, అరటి పంటల సాగుకు రైతులకు ప్రయోజనాలు కలుగుతాయి.

- ఎస్‌ మహేశ్‌, ఉద్యానవనశాఖ అధికారి, ఇచ్చోడ


logo