మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Aug 14, 2020 , 01:04:46

మత్స్యకారులకు జీవనోపాధి

మత్స్యకారులకు జీవనోపాధి

  • ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

బెల్లంపల్లి టౌన్‌: మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ చేపట్టిందని ప్రభుత్వ వి ప్‌ బాల్క సుమన్‌ అన్నారు. ఉచిత పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని, ఎమ్మెల్సీ పురా ణం సతీశ్‌ కుమార్‌, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి గురువా రం ఆయన ప్రారంభించారు. పోచమ్మ చెరువు, రడగంబాల బస్తీ చెరువు, కెమికల్‌ కుంట చెరువులో చేప పిల్లలను పోశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళారీ వ్యవస్థ లేకుం డా వృత్తి దారులే చేపలు పట్టి అమ్ముకునేలా ప్రభుత్వం ఏర్పా ట్లు చేసిందన్నారు. కులస్తులు ఆర్థికంగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు బొడ్డు నారాయణ, కౌన్సిలర్లు, నాయకులు, మత్స్య శాఖ జిల్లా ఏడీ సత్యనారాయణ, మ త్స్య సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు. 


logo