శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Aug 14, 2020 , 01:04:49

బెల్లంపల్లిని అగ్రస్థానంలో నిలుపుదాం

బెల్లంపల్లిని అగ్రస్థానంలో నిలుపుదాం

  • n రూ. 25 కోట్లతో అభివృద్ధి పనులు
  • n కష్టపడిన వారికే పార్టీలో సముచిత స్థానం
  • n ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

బెల్లంపల్లి టౌన్‌: బెల్లంపల్లిని అగ్రస్థానంలో నిలుపుదామని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పిలుపునిచ్చారు. బెల్లంపల్లి వ్యవసాయ మా ర్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అ ధ్యక్షతన  పట్టణంలోని పద్మశాలీ భవన్‌లో గురువారం నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడారు. సాగునీరు పుష్కలం గా అందుతుండడంతో రైతులు పండుగలా వ్యవసాయం చేసుకుంటున్నట్లు చెప్పారు. బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాలకు లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ బెల్లంపల్లి మున్సిపాలిటీకి కేటాయించిన రూ. 25 కోట్ల నిధులకు సంబంధించి సాంకేతిక అనుమతులు లభించిన వెంటనే అభివృద్ధి పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. పట్టణ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుందని పేర్కొన్నారు. తాగునీరు, విద్యుత్‌, మురుగు కాలువల నిర్వహణ, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి కోల్‌బెల్ట్‌ ఏరియాలోనే బెల్లంపల్లిని ప్రథమ స్థానం లో నిలుపుతామని వెల్లడించారు. వ్యవసాయ మార్కెట్‌ పాలకవర్గం రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మార్కెట్‌ కమిటీ ఆదా య వనరులను పెంపు దిశగా మార్గాలను అ న్వేషించాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు స మష్టిగా పార్టీ బలోపేతానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత కాని మాట్లాడుతూ స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ శాఖలో పాలకవర్గం రైతులకు ఎలాంటి ఇ బ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు లాభం చే కూరే ట్రేడర్ల సహకారంతో కమిటీ ఆదాయం పెంచాలన్నారు. ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కు మార్‌ మాట్లాడుతూ పాలకవర్గం రైతుల సంక్షే మం కోసం అహర్నిశలు పాటుపడాలన్నారు. జడ్పీటీసీ, ఎంపీపీగా పని చేసిన అనుభవం ఉన్న కమిటీ అధ్యక్షురాలు పావనికళ్యాణికి స ముచిత స్థానం కల్పించి ఈ పదవి కట్టబెట్టార ని తెలిపారు. అనుగుణంగా ట్రేడర్స్‌ భాగస్వా మ్యం, సహకారం, డైరెక్టర్ల సౌజన్యంతో మా ర్కెట్‌ కమిటీ ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని సూచించారు. కమిటీ అధ్యక్షురాలు గడ్డం పావనికళ్యాణితో జిల్లా మార్కెటింగ్‌ అధికారి ఎల్ల గజానంద్‌ ప్రమాణ స్వీకారం చే యించారు. ఉపాధ్యక్షుడు మోటుపలుకుల రా జశేఖర్‌, డైరెక్టర్లు పెరుమాండ్ల భాస్కర్‌ గౌడ్‌, రుద్రభట్ల లక్ష్మీనారాయణ, సరళా శార్డా, ఏను గు మంజుల, రాంటెంకి వాసుదేవ్‌, తలండి అశోక్‌, బోనగిరి లావణ్య, కొడిప్యాక రంజిత్‌ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనం తరం ఆమెను ప్రముఖులు సన్మానించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సిలువేరు నర్సింగం, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు బొడ్డు నారాయణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ గెల్లి రాజలింగు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి సిద్ధంశెట్టి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

నూతనంగా ఎన్నికైన బెల్లంపల్లి వ్యవసా య మార్కెట్‌ కమిటీ అధ్యక్షురాలు గడ్డం పావనికళ్యాణిని మాల మహానాడు ఆధ్వర్యంలో స త్కరించారు. సంఘం పట్టణాధ్యక్షుడు కుంభా ల రాజేశ్‌, గౌరవాధ్యక్షుడు కుక్కల నర్సయ్య, గౌరవ సలహాదారుడు మాస మురళి, నాయకులు రాజలింగు, సమ్మయ్య, శంకర్‌, శ్రీనివా స్‌, భాస్కర్‌ పాల్గొన్నారు. 


logo