గురువారం 24 సెప్టెంబర్ 2020
Mancherial - Aug 13, 2020 , 01:54:03

‘కరోనా’ భయం వీడాలి

‘కరోనా’ భయం వీడాలి

  • శ్రీరాంపూర్‌ జీఎం లక్ష్మీనారాయణ

సీసీసీ నస్పూర్‌ : కరోనా వైరస్‌ భయం వీడాలని, ముందు జాగ్రత్తే సరైన మందు అని శ్రీరాంపూర్‌ జీఎం కే లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. నస్పూర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ -19 పరీక్షా కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. పరీక్షల కోసం వచ్చిన కార్మిక కుటుంబాలతో మాట్లాడారు. యాజమాన్యం కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలను వారికి వివరించారు. విపత్కర పరిస్థితుల్లో సింగరేణి యాజమా న్యం కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు. పాజిటివ్‌ వస్తే భయపడవద్దని, సింగరేణి క్వారంటైన్‌ సెంటర్‌లో చికిత్స తీసుకోవాలని సూచించారు. బుధవారం 167మందికి పరీక్షలు నిర్వహించగా, 27 మందికి పాజిటివ్‌ వచ్చింది. కార్యక్రమంలో డీవైసీఎంవో విజయలక్ష్మి, డాక్టర్‌ విష్ణుమూర్తి, పర్సనల్‌ మేనేజర్‌ అజ్మీరా తుకారాం ఉన్నారు. 

మంచిర్యాల టౌన్‌ (శ్రీరాంపూర్‌ ): జాగ్రత్తలు తీసుకున్నప్పుడే కరోనా వైరస్‌ను నివారించవచ్చని ప్రాజెక్టు ఆఫీసర్‌ పురుషోత్తంరెడ్డి తెలిపారు. బుధవారం ఓసీపీపై నిర్వహించిన అవగాహన సదస్సులో పీవో మాట్లాడారు. కార్మికులకు వైరస్‌ సోకకుండా రక్షణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పని స్థలాల్లోనూ సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయిస్తున్నామని వివరించారు. కరోనా పరీక్షా కేంద్రాలు పెంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో మేనేజర్‌ జనార్దన్‌, సేఫ్టీ ఆఫీసర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, టీబీజీకేఎస్‌ రీజియన్‌ కార్యదర్శి మంద మల్లారెడ్డి, పిట్‌ కార్యదర్శి పెంట శ్రీనివాస్‌, సీనియర్‌ పీవో హషీమ్‌పాషా పాల్గొన్నారు. 


logo