గురువారం 24 సెప్టెంబర్ 2020
Mancherial - Aug 13, 2020 , 01:54:16

అవసరమైన ఏర్పాట్లు చేయండి

 అవసరమైన ఏర్పాట్లు చేయండి

  •  కరోనాపై అప్రమత్తంగా ఉండాలి  n ఉద్యోగులకు పరీక్షలు చేయాలి
  •  వైద్యాధికారులతో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సమీక్ష..

ఆసిఫాబాద్‌ టౌన్‌ : కలెక్టర్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలును ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వైద్యాధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రోజు రోజుకూ కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తున్నదని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రైమరీ, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లలో ఆక్సిజన్‌ ఏర్పాటు చేయాలన్నారు. వాంకిడి క్వారంటైన్‌లో 28 మంది, ఆసిఫాబాద్‌లో 15, సాంఘిక సంక్షేమ గురుకులంలో 16, కాగజ్‌నగర్‌లోని  బాలికల వసతి గృహంలో 12, గోలేటిలో 17 మంది చొప్పున చికిత్స  పొందుతున్నారని జిల్లా వైద్యాధికారి కలెక్టర్‌కు వివరించారు. 17 రోజుల తర్వాత తిరిగి పరీక్షలు నిర్వహించి డిశ్చార్జి చేస్తామని చెప్పారు. 

స్వాతంత్య్ర వేడుకలకు అరెకపూడి గాంధీ

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు ముఖ్య అతిథిగా విప్‌ అరెకపూడి గాంధీని ప్రభుత్వం జిల్లాకు నియమించినట్లు కలెక్టర్‌ తెలిపారు. కొవిడ్‌ -19 నిబంధనలకు లోబడి కలెక్టరేట్‌లో వేడుకలు ఉంటాయని చెప్పారు.  అదనపు కలెక్టర్‌ రాంబాబు, రెవెన్యూ అధికారి సురేశ్‌, ఆర్డీవో సిడాం దత్తు, డీటీడీవో దిలీప్‌ కుమార్‌, డీపీవో రమేశ్‌, తదితరులు ఉన్నారు. logo