ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mancherial - Aug 13, 2020 , 01:54:05

ట్రాక్టర్‌పై వెళ్లి.. పనులు పరిశీలించి

ట్రాక్టర్‌పై వెళ్లి.. పనులు పరిశీలించి

  • lగొల్లపల్లి, అల్లీపూర్‌ గ్రామాల్లో అదనపు కలెక్టర్‌ దీపక్‌ పర్యటన
  • lపలు అభివృద్ధి పనుల పరిశీలన

సుల్తానాబాద్‌ రూరల్‌: మండలంలోని గొల్లపల్లి, అల్లీపూర్‌ గ్రామాల్లో బుధవారం ఉదయం అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పర్యటించారు. గొల్లపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు వెళ్లిన ఆయన దారిలో బురద ఉండడంతో ట్రాక్టర్‌పై వెళ్లారు. ప్రజల సౌకర్యార్థం వైకుంఠధామానికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని అదనపు కలెక్టర్‌ హామీ ఇచ్చారు. మైదానం లేకపోవడంతో తహసీల్దార్‌ హన్మంతరావుకు ఫోన్‌ చేసి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి క్రీడా మైదానానికి కేటాయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కలియ తిరిగి పనులను పర్యవేక్షించారు. వైకుంఠధామాలు, డంప్‌ యార్డు, నర్సరీలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామాల్లోని పరిసరాల పరిశుభ్రత, హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. అల్లీపూర్‌లో నర్సరీని సందర్శించి, మొక్కల సంరక్షణకు ప్రత్యేకంగా బోర్‌ వేయించాలని నిర్వాహకులకు సూ చించారు. ఆయన వెంట సర్పంచులు బండారి రమేశ్‌, గడ్డం వసంత, ఎంపీటీసీ గట్టు శ్రీనివాస్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ మ హిపాల్‌రెడ్డి, ఉప సర్పంచులు ఆవుల వెం కటేశ్‌, గ్రామస్తులు గట్టు శ్రీనివాస్‌గౌడ్‌, పుట్ట సదయ్య, మౌటం గంగాప్రసాద్‌, కోదాటి రాజకొమురయ్య, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


logo