ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mancherial - Aug 13, 2020 , 01:54:06

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

  • రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి ఈశ్వర్‌

ధర్మపురి: కరోనా ఉధృతి కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. ధర్మపురిలో కొవిడ్‌ కేసులు పెరిగిన నేపథ్యంలో బుధవారం ఆయన హైదరాబాద్‌ క్యాంపు కార్యాలయం నుంచి ఆయా శాఖ ల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఫోన్లో మా ట్లాడి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ‘నమస్తే’తో మాట్లాడారు. వైరస్‌ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైతే టెస్ట్‌ల సంఖ్య పెంచాలని అధికారులకు సూచించారు. ప్రజలు స్వీయ రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మా స్కులు ధరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వార్డులో శానిటేషన్‌ చేయాలని, పోలీసులు విస్తృతంగా పెట్రోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించానన్నారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని, ప్రతివార్డులో ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీలు, వీఆర్వో, పోలీసులతో కూడిన బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించాలని కోరారు. అలాగే కరోనా బారిన పడ్డవారు మనోధైర్యంగా ఉండాలని, కరోనా చికిత్సకు అవసరమైన మందులు సరిపడా అందుబాటులో ఉన్నాయన్నారు. బాధితులు డాక్టర్ల సూచనలు పాటించాలని కోరారు. logo