ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mancherial - Aug 12, 2020 , 02:56:45

కార్మికులను కాపాడుకుంటాం

కార్మికులను కాపాడుకుంటాం

  •   n  ఎంత ఖర్చుకైనా వెనుకాడబోం
  •   n  ప్రాణాల మీదికి రాకముందే  పరీక్షలు చేయించుకోవాలి
  •   n  కరోనా పాజిటివ్‌ వచ్చిన  వారికి మెరుగైన వైద్యం
  •   n  ఉద్యోగులకు మనోధైర్యాన్ని నింపాలి
  •   n  సింగరేణి ప్రాజెక్టులు, ప్లానింగ్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ బలరాం
  •   n  శ్రీరాంపూర్‌, రామకృష్ణాపూర్‌లో పర్యటన
  •   n  సీసీసీ నస్పూర్‌ కాలనీలో   కొవిడ్‌-19 పరీక్ష కేంద్రం ప్రారంభం\

సీసీసీ నస్పూర్‌:  కరోనా వైరస్‌ బారి నుంచి కార్మికులను కాపాడు కుంటామని సింగరేణి ప్రాజెక్టులు, ప్లానింగ్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ బలరాం అన్నారు. నస్పూర్‌కాలనీ సేవా భవన్‌లో కొవిడ్‌-19 టెస్టింగ్‌ సెంటర్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వైరస్‌ వ్యాప్తి నివారణకు యాజమాన్యం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదన్నారు. నస్పూర్‌కాలనీ, శ్రీరాంపూర్‌ కాలనీల్లోనూ టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేశామని, కార్మికులు వారి కుటుంబ సభ్యులకు లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం ఏరియా జనరల్‌ మేనేజర్‌ కందుకూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం కుమారస్వామి, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, సీఎంవోఏఐ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, క్వాలిటీ జీఎం హబీబ్‌ హుస్సేన్‌, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్‌రెడ్డి, డీవైసీఎంవో విజయలక్ష్మి, డాక్టర్‌ విష్ణుమూర్తి పాల్గొన్నారు. 

ఆర్కే న్యూటెక్‌పై అవగాహన..

శ్రీరాంపూర్‌: శ్రీరాంపూర్‌ ఏరియా ఆర్కే న్యూటెక్‌ గనిపై సింగరేణి ప్రా జెక్టులు, ప్లానింగ్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ బలరాం  కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జీఎం లక్షీనారాయణ, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డితో కలిసి కరోనా వైరస్‌ నివారణ అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు కార్పొరేట్‌ దవాఖానలతో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఒక్కో ఏరియాలో రోజుకు 200 ర్యాపిడ్‌ కిట్లతో కరోనా పరీక్షలు చేస్తారన్నారు. క్వాలిటీ జీ ఎం హబీబ్‌ హుస్సేన్‌, డీవైజీఎం రఘుకుమార్‌, మేనేజర్‌ వెంగళరావు, టీబీజీకేఎస్‌ పిట్‌ కార్యదర్శి పొట్లపెల్లి శ్రీరాములు, పీఎం తుకారాం పాల్గొన్నారు. 

కార్మికుల్లో మనోధైర్యం నింపాలి..

కార్మికుల్లో మనోధైర్యం నింపాలని సింగరేణి ప్రాజెక్టులు, ప్లానింగ్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ బలరాం ఆదేశించారు. శ్రీరాంపూర్‌ జీఎం ఆఫీస్‌లో జీఎం లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఏరియా అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు, క్వారంటైన్‌ కేంద్రాల నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గనులు, డిపార్ట్‌మెంట్లపై కరోనా నివారణ చర్యలు పెంచాలన్నారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం కుమారస్వామి, క్వాలిటీ జీఎం హబీబ్‌ హుస్సేన్‌, సేఫ్టీ ఆఫీసర్‌ గుప్తా, డీవైజీఎం నూక రమేశ్‌, విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌, రఘుకుమార్‌, పీవోలు పురుషోత్తంరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, పీఎం తుకారాం పాల్గొన్నారు. 

సింగరేణి ఏరియా దవాఖాన తనిఖీ..

రామకృష్ణాపూర్‌: రామకృష్ణాపూర్‌ సింగరేణి ఏరియా దవాఖానను సింగరేణి ప్రాజెక్టులు, ప్లానింగ్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ బలరాం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ కట్టడి, కొవిడ్‌ సోకిన కార్మికులు, వారి కుటుంబాల రక్షణకు సింగరేణి సంస్థ ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడడం లేదని చెప్పారు.  ప్రాణాల మీదికి రాకముందే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దవాఖానలో కరోనా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే 90 బెడ్లు ఉండగా, మరో 1000 బెడ్లు, మందుల కొనుగోళ్లకు నిధులు మంజూరు చేశామన్నారు. డాక్టర్లు, నర్సుల నియామకం, మౌలిక సదుపాయల కల్పనకు చర్యలు తీసుకుంటు న్నామని చెప్పారు. ప్రతిరోజూ 200 మందికి పరీక్షలు చేస్తారన్నారు. రాబోయే 2 నెలల్లో కార్మికులందరికీ టెస్ట్‌లు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌, శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం లక్ష్మీనారాయణ, డీవై సీఎంవో డాక్టర్‌ ఉష, డాక్టర్లు లోక్‌నాథ్‌రెడ్డి, మోహన్‌రావు, రాజారమేశ్‌, ప్రసన్న పాల్గొన్నారు.logo