మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Mancherial - Aug 12, 2020 , 02:56:48

కంటైన్మెంట్‌ జోన్‌గా గోలేటిటౌన్‌ షిప్‌

కంటైన్మెంట్‌ జోన్‌గా గోలేటిటౌన్‌ షిప్‌

రెబ్బెన : కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో గోలేటి ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్‌ కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. గోలేటిలో ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న పలు కుటుంబాలకు చెందిన 11మందికి, మరో శుభకార్యానికి హాజరైన ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. గోలేటిటౌన్‌షిప్‌ను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తహసీల్దార్‌ రియాజ్‌అలీ తెలిపారు. ప్రతి రోజూ  సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయిస్తున్నట్లు తెలిపారు. దుకాణాసముదాయాలకు ఉదయం 9నుంచి 11గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. తహసీల్దార్‌తో పాటు  సీఐ ఆకుల అశోక్‌, ఎస్‌ఐ రమేశ్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. 

తిర్యాణి: మండలంలోని మెస్రంగూడకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తహసీల్దార్‌ మస్కూర్‌ అలీ తెలి పారు. మెస్రంగూడను మంగళవారం సందర్శించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటి పరిసరాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావ ణాన్ని పిచికారీ చేయించారు. బాధితుడిని వాంకిడి ఐసొలేషన్‌కు తరలించారు. 15 మందిని హోంక్వారంటైన్‌ చేశారు. రొంపల్లి వైద్యుడు మురళీధర్‌, కార్యదర్శి సురేశ్‌గౌడ్‌ ఉన్నారు. 

మందమర్రి : పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కొవిడ్‌-19 పరీక్షల్లో 18 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న 53 మందికి పరీక్షలు చేయగా మందమర్రి, రామకృష్ణాపూర్‌ ప్రాంతాలకు చెందిన 18 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డాక్టర్‌ అలేఖ్య తెలిపారు. బాధితులకు ఉచి తంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. హోం క్వారం టైన్‌లో ఉండాలని వారికి సూచించారు. 

దండేపల్లి : దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 8మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యా ధికారి సునీల్‌ తెలిపారు. తాళ్లపేట-1, కాసిపేట-1, కొత్తూర్‌-1, దండేపల్లికి చెందిన ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. 


logo