శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Aug 10, 2020 , 23:21:48

నేడే ఆఖరు

నేడే ఆఖరు

  • రైతు బీమాకు నేటితో ముగియనున్న గడువు
  • అన్నదాతల నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • జిల్లాలో కొత్తగా 326 మందికి ప్రయోజనం

అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, వారి కుటుంబాలకు భరోసానిచ్చేందుకు ‘రైతు బీమా’ అమలు చేస్తున్నది. ఈ మేరకు కొత్తగా పట్టా పాస్‌ పుస్తకాలు పొందిన వారికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నది. మంగళవారంతో దరఖాస్తుల గడువు ముగియనుండగా, పట్టాపాస్‌పుస్తకం, నామినీ వివరాలు, ఆధార్‌కార్డు జిరాక్సులతో మండల వ్యవసాయశాఖ కార్యాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. 

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : ఆసిఫాబాద్‌ జిల్లాలోని రైతుల కుటుంబాలకు  రైతు బీమా పథకం ఎంతో ప్రయోజనకరంగా మా రింది. జిల్లాలో దాదాపు 1,11.383 మంది రైతు లు ఉన్నారు. ఇందులో 19-59 ఏళ్లలోపు రైతు లు 65,181 మంది ఉన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 372 మంది చనిపోగా రైతు బీమా పథకం ద్వారా 326 రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున డబ్బులు అందించారు. జిల్లాలో మరో 46 మంది బీమా డబ్బులు అందించాల్సి ఉంది. వ్యవసాయాధారిత కుటుంబాలకు రైతు బీమా పథకం ఎంతో ఆసరాగా నిలుస్తున్నది.  రైతు ప్రమాదశాత్తు మృతి చెందినా, అకాల మర ణం సంభవిస్తే ఆ రైతు కుటుంబాలకు బీమా పథకం ఎంతో అండగా ఉంటున్నది. వారి కుటుం బాలు నిలదొక్కుకోవడానికి  ఉపయోగపడు తున్నాయి.

నేటితో ముగియనున్న గడువు

జిల్లాలో రైతు బీమా పథకానికి కొత్తగా పట్టా దారుపాసు పుస్తకాలు పొందిన రైతుల నుంచి వ్యవసాయ శాఖ అర్జీలు స్వీకరిస్తున్నది. ఈ గడవు మంగళవారంతో ముగియనున్నది. గతంలో పట్టాదారు పాసు పుస్తకాలు లేని వారు తమ పేర్లను పథకంలో నమోదు చేసుకోలేకపోయారు. ఈ ఏడాది సుమారు 326 వరకు కొత్త పట్టాదారు పాసుపుస్తకలు పొందినట్లు తెలుస్తున్నది. మండల వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో ఏఈవోలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పట్టాదారు పాస్‌పుస్తకం, నామినీ వివరాలు, ఆధార్‌కార్డు జిరాక్సులతో దరఖాస్తు చేసుకోవచ్చు.