గురువారం 01 అక్టోబర్ 2020
Mancherial - Aug 10, 2020 , 00:08:25

ప్రతి గ్రామం శుభ్రంగా ఉండాలి

ప్రతి గ్రామం శుభ్రంగా ఉండాలి


మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌) : ప్రతి గ్రామం పరి శుభ్రంగా ఉండాలని హాజీపూర్‌ వైస్‌ ఎంపీపీ బేతు రమాదేవి అన్నారు. గంధగీ ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగం గా హాజీపూర్‌ మండలం  దొనబండలో ఆదివారం సర్పంచ్‌ జాడి సత్యం,పంచాయతీ సిబ్బందితో కలసి అవగాహన  కల్పించారు. గుడిపేట, కర్ణమామిడి, ముల్కల్లలో ఆయా గ్రా మాల సర్పంచ్‌లు ర్యాలీలు తీశారు. ఇండ్లలో ఉన్న ప్లాస్టిక్‌ వస్తువులు సేకరించారు. గుడిపేట పంచాయతీలోని కిరాణాషాపులో ప్లాస్టిక్‌ కవర్లు ఎక్కువ లభించడంతో నిర్వాహకుడికి రూ. 500 జరిమానా విధించారు.  గ్రామాల శుభ్రతకు ప్రజలు సహకరించాలని వైస్‌ ఎంపీపీ కోరారు. పశువులను రోడ్లపై వదిలివేయవద్దన్నారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

 ప్లాస్టిక్‌ వినియోగంతో మానవాళికి ముప్పు

తాండూర్‌ : ప్లాస్టిక్‌ వినియోగంతో వాతావరణ కాలు ష్యం ఏర్పడి మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని బుగ్గ దేవస్థానం చైర్మన్‌, బోయపల్లి ఎంపీటీసీ మాసాడి శ్రీదేవి, సర్పంచ్‌ భీమ సునీత  అన్నారు. గంధగీ ముక్త్‌ భార త్‌ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం బోయపల్లిలో ప్ల్టాస్టిక్‌ వ్యర్థాల తొలగింపు చేపట్టారు. మండలంలోని అన్ని గ్రామా ల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 

చెన్నూర్‌ రూరల్‌:   మండలంలోని కిష్టంపేట, సంకారం, ఆస్నాద్‌లో చెత్త చెదారంతో పాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొల గించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియా డారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు బుర్ర రాకేశ్‌ గౌడ్‌, చెడెంక పున్నం, నాగభూషణం చారి, ఉప సర్పంచ్‌ నస్కూరి శ్రీని వాస్‌, కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. 

దండేపల్లి : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం గంధగీ ముక్త్‌ భారత్‌ కార్యక్రమాలు నిర్వహించారు.ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరించారు. ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే అనర్థాలను వివరించారు. బట్ట సంచు లు ఉపయోగించాలని సూచించారు. వారం పాటు స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చంద్రకళ, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

భీమారం : గంధగీ ముక్త్‌ భారత్‌ వారోత్సవాల్లో భాగంగా గ్రామాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించాలని  జడ్పీటీసీ భూక్యా తిరుమల నాయక్‌, సర్పంచ్‌ గద్దె రాంరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ఆవుడం క్రాస్‌ రోడ్డు సమీపం లో ప్లాస్టిక్‌ అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమం లో ఉప సర్పంచ్‌ బానోత్‌ అమర్‌ సింగ్‌ నాయక్‌, మాజీ జడ్పీటీసీ జర్పుల రాజ్‌ కుమార్‌ నాయక్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో శ్రీపతి బాపు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు. 

కాసిపేట : కొమటిచేనులో ఆదివారం గంధగీ ముక్త్‌ భార త్‌ కార్యక్రమం ప్రారంభించారు. మొదటి రోజు ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. దేవాపూర్‌, సోమగూడెం(కే), ముత్యంపల్లి, తాటిగూడ, లంబాడీతండా(డీ), కాసిపేట, చిన్న ధర్మారం, సోనాపూర్‌, పల్లంగూడలో పారిశుద్ధ్య  కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీపీ రొడ్డ లక్ష్మి, ఎంపీడీవో ఎంఏ అలీం, సర్పంచ్‌ రాంటెంకి శ్రీనివాస్‌, ఎంపీటీసీ చంద్రమౌళి, ఉప సర్పంచ్‌ సూర్య ప్రకాశ్‌, ఆయా పంచాయతీల్లో సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు. 

వేమనపల్లి : మండలంలోని నీల్వాయిలో సర్పంచ్‌ గాలి మధు ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో కుబిడె మధూకర్‌, బాపు, రాజలింగు, కొండాల్‌రెడ్డి, స్వరూపారాణి, పద్మ,రాజేశ్వరి, దుర్గక్క, వెంకట్‌ పాల్గొన్నారు. 

కోటపల్లి :  గంధగీ ముక్త్‌  భారత్‌ కార్యక్రమంలో భాగం గా మండలంలో ఆదివారం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరించారు. పరిసరాల శుభ్రతపై సర్పంచ్‌లు, కార్యదర్శులు ప్రజలకు అవగాహన కల్పించారు.

బెల్లంపల్లి టౌన్‌ (బెల్లంపల్లి రూరల్‌): బెల్లంపల్లి మండలం  ఆకెనపల్లిలో ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. ఇన్‌చార్జి సర్పంచ్‌ తిరుమల, కార్యదర్శి శ్రీనివాస్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

తాజావార్తలు


logo