సోమవారం 19 అక్టోబర్ 2020
Mancherial - Aug 10, 2020 , 00:08:50

పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి

కాగజ్‌నగర్‌ రూరల్‌/రెబ్బెన/దహెగాం : పరిసరాల  శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని డీఆర్‌డీవో వెంకట్‌ శైలేశ్‌ సూచించారు. స్వచ్ఛభారత్‌ మురుగు రహిత వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని బీబ్రా గ్రామంలో చేపట్టిన ప్లాస్టిక్‌ వ్యర్థాల ఏరివేతలో ఆయన రైతుబంధు సమితి   మండల కన్వీనర్‌ సంతోష్‌ గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో పాటు చెత్త, పిచ్చి మొక్కలను తొలగించి డంప్‌ యార్డుకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల పరిశుభ్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు, యువకులు భాగస్వాములవ్వాలన్నారు. వారం రోజుల పాటు మురుగు రహిత కార్యక్రమాన్ని చేపట్టాలని మొదటి రోజు ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఏరివేయడం, రెండో రోజూ శ్రమదానం ఈ విధంగా పలు రకాల కార్యక్రమాలు చేపట్టి స్వచ్ఛ గ్రామాలను నెలకొల్పడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛభారత్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ ఫణి, ఎంపీవో రాజేశ్వర్‌, రైతుబంధు మండల కన్వీనర్‌ కే సంతోష్‌ గౌడ్‌, సర్పంచ్‌ బండ కృష్ణమూర్తి, నాయకులు తుమ్మిడె పాపయ్య, సోను, కే మహేశ్‌ గౌడ్‌, ఉప సర్పంచ్‌ కళావతి పాల్గొన్నారు. రెబ్బెన మండల కేంద్రంలో డీఆర్డీవో వెంకట శైలేశ్‌ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు చెన్న సోమశేఖర్‌, వైస్‌ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, సర్పంచ్‌లు బోమ్మినేని అహల్యాదేవి, పొటు సుమలత, పందిర్ల వినోద, బుర్స పోషమల్లు, ఉప సర్పంచ్‌లు మడ్డి శ్రీనివాస్‌గౌడ్‌, సతీశ్‌, కార్యదర్శులు వంశీకృష్ణ, శివకృష్ణ, ఎస్‌బీఎం ఫణి, గ్రామస్తులు బీ శ్రీధర్‌, పీ మధునయ్య, గోపి పాల్గొన్నారు. కాగజ్‌నగర్‌ రూరల్‌ మండలంలో ఈజ్‌గాం గ్రామంలో చేపట్టిన పరిశుభ్రత పనులను డీఆర్డీవో వెంకట్‌ శైలేశ్‌ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పా రిశుద్ధ్యం లోపించకుండా పంచాయతీ సభ్యులు, సర్పంచ్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఏపీడీ రామకృష్ణ, పంచాయతీ అధికారి రఘు, ఫణికుమార్‌, సర్పంచ్‌ మల్లేశ్‌, ఉప సర్పంచ్‌ అర్జున్‌, ఎంపీటీసీ కుమార్‌, పంచాయతీ కార్యదర్శి రజిత, గ్రామస్తులు ఉన్నారు.

పరిశుభ్రతే లక్ష్యం   ..                                                                                                                                                 

తిర్యాణి: గ్రామాలు శుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్‌, చింతపల్లి సర్పంచ్‌ ఆత్రం రుక్మిణి అన్నారు. గంధగి ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని చింతపల్లి గ్రామంలో గ్రామస్తులతో కలసి గ్రామ గ్రామానా రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌ వైజర్‌ శ్రీనివాస్‌, వివో అధ్యక్షుడు చిక్రం కావేరి, పేసా సభ్యులు మారుతి, గ్రామస్తులు ఉన్నారు.logo