గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Aug 10, 2020 , 00:08:49

లక్ష్యానికి చేరువగా..

లక్ష్యానికి చేరువగా..

మంచిర్యాల జిల్లాలో హరితహారం కార్యక్రమం జోరుగా సాగుతున్నది. ఆరో విడుతలో భాగంగా 67.33 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, అధికార యంత్రాంగం ఇప్పటికే 54.73 లక్షలు నాటింది. వర్షాలు అనుకూలిస్తుండడంతో ఆయా శాఖల ఆధ్వర్యంలో 81.29 శాతం నాటగా, ఈ నెలాఖరుకల్లా 100 శాతం పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నది. మరోవైపు పల్లె ప్రకృతి వనాల పేరిట మరింత పచ్చదనం పెంపొందించేందుకు కసరత్తు చేస్తున్నది.

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : జిల్లా లో ఆరో విడుత హరితహారంలో భాగంగా భారీ సంఖ్యలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇప్పటికే ఐదు విడుతల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటగా, ఆరో విడుతలో అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు. ఈ యేడాది 67,33,370 మొక్క లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 54,73,821 మొక్కలు నాటారు. జిల్లాలో అటవీ, గ్రామీణాభివృ ద్ధి, ఉద్యానవనశాఖలతో పాటు మున్సిపాలిటీ నర్సరీల్లో మొక్కలు పెంచారు. 311 గ్రామ పంచాయతీల్లో గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో నర్సరీలు ఏర్పాటు చేశారు. స్థానికంగా అవసరమయ్యే మొక్కలను, ఆయా గ్రామ పంచాయతీల్లోనే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో లెక్కకు మించి మొక్కలను ఆయా గ్రామాలు, ప్రాంతాలకు సరఫరా చేశారు. మరోవైపు మొక్కలు నాటేందుకు శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. సుమారు 30 శాఖలకు లక్ష్యాలను ఇచ్చా రు. వర్షాలు కూడా అనుకూలిస్తుండడంతో ఇప్పటికే ఆయా శాఖల ఆధ్వర్యంలో 81.29 శాతం మొక్కలు నాటారు. ఈ నెలాఖరుకల్లా లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

నర్సరీలు.. పార్కులు...

జిల్లాలోని 311 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ప్రస్తుతం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది. ప్రతి గ్రామంలో పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల స్థలాల ఎంపిక పూర్తయ్యింది. ఎకరం స్థలంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి.. పార్కులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పల్లెల్లో పచ్చదనం మరింతగా పెరగనున్నది. ఈనెల 10లోగా పనులు ప్రారం భించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిం ది. సాధ్యమైనంత వరకు ప్రభు త్వ భూముల్లోనే ఏర్పాటు చేయాలని ఆదేశించగా, వీటిని గుర్తించే బాధ్యతను స్థానిక తహసీల్దార్లకు అప్పగించింది. ప్రభుత్వం భూము లు లేని చోట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి ఇవ్వాల్సి ఉంటుం ది. గ్రామ పంచాయతీలు ముం దుకు రాని చోట్ల కలెక్టర్‌ నిర్ణయం తీసుకుంటారు.


logo