ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Aug 07, 2020 , 03:52:11

న్యాయం చేయాలని మహిళల ఆందోళన

న్యాయం చేయాలని మహిళల ఆందోళన

కాసిపేట : తమకు న్యాయం చేయాలని ముగ్గురు మహిళలు తహసీల్‌ కార్యాలయం ఎదుట గురు వా రం ఆందోళనకు దిగారు. కార్యాలయం నుంచి ఎవరినీ బయటకు వెళ్లకుండా అధికారులను అడ్డు కు న్నారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు మాట్లా డుతూ కాసిపేట శివారులోని 293/అ సర్వేలో తమ తండ్రి లింగయ్యకు మూడు ఎకరాల ఇనాం భూమి ఉందన్నారు. ఈ భూమిని కొంత మంది కబ్జా చేశారని, దీంతో రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించారని మండిపడ్డారు. ఇటీవల ఓపెన్‌ కాస్ట్‌లో ఎకరం భూమి ముంపునకు గురికాగా కబ్జాదారులకు పరిహారం అందించారని ఆరోపించారు. మిగతా రెండు ఎకరాల భూమి కూడా ఓసీలో పోతుండగా వారికే పరిహారం  అందించాలని చూస్తున్నారని ఆందోళన కు దిగారు. రెవెన్యూ అధికారులు డబ్బుల కోసం కబ్జాదారులతో లాలూచీ పడి మాకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద స్థానిక రెవెన్యూ అధికారులతో సంయుక్తంగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పోలీసుల హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. 


logo