బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - Aug 07, 2020 , 03:52:12

కార్మికుల సంక్షేమమే సర్కారు లక్ష్యం

కార్మికుల సంక్షేమమే సర్కారు లక్ష్యం

  • n మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌ రావు
  • n మున్సిపల్‌ సపాయి కార్మికులకు   జీతాల చెక్కులు అందజేత 

లక్షెట్టిపేట రూరల్‌ : కొవిడ్‌ -19 వేళ ఫ్రంట్‌ లైన్‌ వారియర్లుగా పని చేస్తున్న మున్సిపల్‌ సపాయి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు నిరంతరం పని చేస్తున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. లక్షెట్టిపేట ము న్సిపల్‌ కార్యాలయ ఆవరణలో సపాయి కార్మికులకు జీవో ఎంఎస్‌ నంబర్‌ 14 ప్రకారం పెంచిన జీతాలకు సంబంధించిన చెక్కులను గురువారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్మికుడికి రూ. 12 వేల ను ఈ నెల నుంచి ప్రతి నెలా చెల్లిస్తామన్నారు. ఇం దులో మున్సిపల్‌ చైర్మన్‌ నలమాసు కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ పొడేటి శ్రీనివాస్‌ గౌడ్‌, కమిషనర్‌ బట్టు తిరుపతి, కౌన్సిలర్లు సురేశ్‌నాయక్‌, చాతరాజు రాజన్న, ఓరగంటి శ్రీకాంత్‌, మెట్టు కల్యాణి, రాందే ని వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షుడు అంకతి రమేశ్‌, కోఆప్షన్‌ సభ్యులు నూనె ప్రవీణ్‌, గరిసే రవీందర్‌, నాయ కు లు మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సోలిపేట మృతికి సంతాపం

మంచిర్యాలటౌన్‌ : దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపై మంచిర్యాల ఎమ్మెల్యే ది వాకర్‌రావుతోపాటు స్థానిక నాయకులు సంతా పం వ్యక్తం చేశారు. రెండు నిమిషాలు మౌనం పాటించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ రామలింగారెడ్డి జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమ కారుడిగా పని చేసి మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌గౌడ్‌, నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ విజిత్‌రావు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు గొంగళ్ల శంకర్‌, తోట తిరుపతి, గడప రాకేశ్‌, వెంకటేశ్‌, కార్కూరి చంద్రమౌళి, శ్రీపతి వాసు, చంద్రశేఖర్‌ హండే, బల్జపెల్లి సత్యనారాయణ, సుదమల్ల అశోక్‌ తేజ, మట్టెల రమేశ్‌, వాసు, తదితరులు పాల్గొన్నారు.logo