శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Aug 06, 2020 , 02:39:47

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే జై..

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే జై..

  • n మంచిర్యాల, లక్షెట్టిపేట మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పూర్తి
  • n రెండు చోట్లా దక్కించుకున్న అధికార పార్టీ
  • n నియామక పత్రాలు అందజేత
  • n శ్రేణుల్లో విజయోత్సాహం

మంచిర్యాలటౌన్‌ : మంచిర్యాల మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యులను బుధవారం ఎన్నుకున్నారు. టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ బలపరిచిన నలుగురు అభ్యర్థులకు 22 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు. మిగిలిన 14 మంది కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు స్పందించలేదు. ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవజ్ఞుల కోటా నుంచి మామిడిశెట్టి రమేశ్‌, సుగుణ హండేను ఎంపిక చేయగా, అల్ప సంఖ్యాక వర్గాల కోటాలో జాఫర్‌ హుస్సేన్‌, అఫ్సియా సుల్తానా ఎన్నికయ్యారు. వీరికి చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌గౌడ్‌, అధికారుల సమక్షంలో కమిషనర్‌ స్వరూపారాణి నియామక పత్రాలను అందించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తమ వంతు కృషిచేస్తామని కో-ఆప్షన్‌ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, చైర్మన్‌ పెంట రాజయ్య, పార్టీ నాయకులు, కౌన్సిలర్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

టీఆర్‌ఎస్‌ విజయోత్సాహం..

ఎన్నిక తర్వాత కో-ఆప్షన్‌ సభ్యులతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకొని సంబురాలు చేసుకున్నారు. అక్కడ విగ్రహానికి పూల మాలలు వేసి, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌గౌడ్‌, నాయకులు గొంగళ్ల శంకర్‌, వదూద్‌, కొండల్‌రావు తదితరులు పాల్గొన్నారు.  

లక్షెట్టిపేట రూరల్‌ :  లక్షెట్టిపేట మున్సిపాల్‌ కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారు. నూనే ప్రవీణ్‌, సయ్యద్‌ షాహిద్‌ అలీ, మోత్కూరు రాజేశ్వరి, సారా బేగం ఎన్నికయ్యారు. చైర్మన్‌ నలమాసు కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ పొడేటి శ్రీనివాస్‌ గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి వారితో ప్రమాణ స్వీకారం చేయించా రు. అనంతరం కో-ఆప్షన్‌ సభ్యులు మాట్లాడుతూ.. మున్సిపల్‌ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు చాతరాజు రాజన్న, ఓరగంటి శ్రీకాంత్‌, సురేశ్‌ నాయక్‌, రాందేని వెంకటేశ్‌, మెట్టు కల్యాణి, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.logo