బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Aug 06, 2020 , 02:39:50

సివిల్స్‌లో సింగరేణి బిడ్డ..

సివిల్స్‌లో సింగరేణి బిడ్డ..

  • n  శ్రీరాంపూర్‌కు చెందిన ధరిపెల్లి రమేశ్‌కు 690వ ర్యాంక్‌
  • n  ఉద్యోగం చేస్తూనే కల సాకారం చేసుకున్న యువకుడు

మంచిర్యాల టౌన్‌ (శ్రీరాంపూర్‌ ): శ్రీరాంపూర్‌కు చెందిన సింగరేణి కార్మికుడి కొడుకు సివిల్స్‌లో 690 ర్యాంక్‌ సాధించాడు. చిన్నప్పటి  నుంచి చదువులో ముందున్న ధరిపెల్లి రమేశ్‌  కఠోర సాధనతో సివిల్స్‌లో ర్యాంకు సాధించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ధరిపెల్లి రాయమల్లు- పుష్ప దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాయమల్లు శ్రీరాంపూర్‌ ఏరియా ఆర్కే న్యూటెక్‌ గనిలో జనరల్‌ మజ్దూర్‌గా పని చేస్తున్నాడు. తల్లి గృహిణి. వారిద్దరూ నిరక్ష్యరాస్యులే. తమ పిల్లలకు ఉన్నత విద్యనందించాలనే లక్ష్యంతో చదివించారు. పెద్ద కుమారుడు రమేశ్‌ పదో తరగతి వరకు శ్రీరాంపూర్‌లోనే చదివాడు. వరంగల్‌లో పాలిటెక్నిక్‌, బీటెక్‌ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌ సంస్థలో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అటు ఉద్యోగం చేస్తూనే రమేశ్‌ తన లక్ష్య సాధనకు మూడేళ్లుగా కఠోర సాధన చేశాడు. ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ పొందాడు. రెండుసార్లు సివిల్స్‌ రాసినా సఫలం కాలేదు. 2014 నుంచి పట్టు వీడకుండా కష్టపడి చదివాడు. ఈ నెల 4న ప్రకటించిన  యూపీపీఎస్సీ-2019 ఫలితాల్లో 690 ర్యాంక్‌ సాధించాడు. రమేశ్‌ తమ్ముడు రైల్వేలో పని చేస్తున్నాడు. ఇద్దరు చెల్లెళ్లు కూడా హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. నిరక్ష్యరాస్యుడైన కార్మికుడి కొడుకు సివిల్స్‌లో ర్యాంకు సాధించడంపై ఈ ప్రాంత వాసులు, శ్రీరాంపూర్‌ జీఎం కే లక్ష్మీనారాయణ, శారదా శిశు మందిర్‌ హై స్కూల్‌ ప్రిన్సిపాల్‌  రాంరెడ్డి అభినందించారు. 

సివిల్స్‌ నా లక్ష్యం.. 

ప్రతి విద్యార్థి ఉన్న త లక్ష్యం నిర్దేశించుకొని, ఆ దిశగా ప్రయత్నించాలి. నేను ఒక చిన్న పాఠశాల నుంచి చ దువు మొదలు పెట్టి సివిల్స్‌కు ఎంపికయ్యాను. బాల్యంలోనే ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు పాటి స్తూ లక్ష్యాన్ని ఎంచుకున్నాను. సివిల్స్‌ సాధించడం ధ్యేయంగా పెట్టుకున్నాను. మా చదువులకోసం మా తండ్రి ఎంతో శ్ర మించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సూచనలతోనే ర్యాంకు సాధించాను.  

ధరిపెల్లి రమేశ్‌logo