ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mancherial - Aug 05, 2020 , 01:58:16

ప్రత్యామ్నాయ బోధన ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి

ప్రత్యామ్నాయ బోధన ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి

  •  డీఈవో వెంకటేశ్వర్లు

మంచిర్యాల అగ్రికల్చర్‌ : కొవిడ్‌ -19 కారణంగా జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్‌వోలు, ప్రిన్సిపాళ్లు ప్రత్యామ్నా య పద్ధతుల ద్వారా అందిస్తున్న బోధనకు సంబంధించిన ఫొటోలు, వాటి వివరాల ను జిల్లా విద్యాశాఖ హెచ్‌ఎం వాట్సాప్‌ గ్రూపులో రోజు వారీగా అప్‌లోడ్‌ చేయాలని డీఈవో ఎస్‌ వెంకటేశ్వర్లు కోరారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి ఆయా స్కూల్‌ కాంప్లెక్స్‌ల హెచ్‌ఎంలు ప్రతి రోజు స్వయంగా సీఆర్పీ సహాయంతో మానిటరింగ్‌ చేయాలని, రోజు వారీగా విద్యార్థులు పాల్గొన్న వివరాలు రికార్డు చేసుకొని జిల్లా విద్యాశాఖ నుంచి అడిగిన రిపోర్టును CRC MNCL DIST వాట్సాప్‌ ద్వారా పంపించాలని సూచించారు. 


logo