శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Mancherial - Aug 05, 2020 , 01:58:17

‘కాళేశ్వరం’ ఎత్తిపోతలు ప్రారంభం

 ‘కాళేశ్వరం’ ఎత్తిపోతలు ప్రారంభం

  •  n కాళేశ్వరం లింక్‌-1లోని  నాలుగు మోటర్లు
  •  n సరస్వతీ పంప్‌హౌస్‌లో 4, పార్వతీలో 4 
  •  n నందిలో 2, గాయత్రీలో 2 మోటర్లు ఆన్‌

 n ఎల్లంపల్లికి రోజుకు టీఎంసీ నీరు ఎత్తిపోతపెద్దపల్లి, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్‌-1లోని ఎత్తిపోతలు మళ్లీ మొదలయ్యాయి. రెండు పంపు హౌస్‌ల్లో నాలుగు చొప్పున మోటర్లను ఆన్‌ చేసి రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు లింక్‌-1 సరస్వతీ పంపు హౌస్‌లోని 1, 3, 5, 7మోటర్లను ఆన్‌ చేసి 11,600 క్యూసెక్కుల నీటిని పార్వతీ పంపు హౌస్‌లోకి ఎత్తిపోస్తున్నట్లు కాళేశ్వరం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. సరస్వతీ బరాజ్‌ సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా, మానేరు నుంచి 2వేల క్యూసెక్కుల వర్షపు నీరు వచ్చి చేరుతుండడంతో బరాజ్‌లో 9.23 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. దీంతో పంపులను ఆన్‌ చేసి ఎగువన గల పార్వతీ బరాజ్‌లోకి రోజుకు టీఎంసీ చొప్పున నీటిని ఎత్తిపోస్తున్నారు. పార్వతీ బరాజ్‌లో 8.83టీఎంసీల సామర్థ్యానికి గాను 5.62 టీఎంసీల నీరు వచ్చి చేరుతున్నది. దీనికి అనుబంధంగా ఉన్న పార్వతీ పంపు హౌస్‌లోని నాలుగు మోటర్లను ఆన్‌ చేసి ప్రతి రోజూ టీఎంసీ నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోస్తున్నారు.


logo