గురువారం 24 సెప్టెంబర్ 2020
Mancherial - Aug 04, 2020 , 02:32:43

‘కో ఆప్షన్‌' టీఆర్‌ఎస్‌కే

‘కో ఆప్షన్‌' టీఆర్‌ఎస్‌కే

  • n నలుగురు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం
  • n శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోనప్ప
  • n పటాకలు కాల్చి శ్రేణుల సంబురాలు

కాగజ్‌నగర్‌టౌన్‌ : కాగజ్‌నగర్‌ మున్సిపల్‌లో నాలుగు కోఆప్షన్‌ పదవులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసు కుంది. మున్సిపాలిటీలో నాలుగు కోప్షన్‌ పదవులకు కమిషనర్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ అధ్యక్షతన ఎన్నికలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌కు చెందిన దేవయ్య, సుభాన్‌, గిరుగుల లక్ష్మి, స్రవంతిబాయి ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవ జ్ఞుల కోటా నుంచి గిరుగుల లక్ష్మి, అబ్దుల్‌ సుభాన్‌, మైనార్టీ కోటా నుంచి స్రవంతిబాయి, దేవయ్య ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శుభాకాంక్షలు తెలిపారు. 

అనంతరం ఎమ్మెల్యే  కోనప్ప మాట్లాడుతూ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు అందరు కలిసి కట్టుగా కృషిచేయాలన్నారు. గెలుపొందిన కోఆప్షన్‌ సభ్యులతో మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయిం చారు.  జై తెలంగాణ నినాదాలు చేసి పటాకాలు కాల్చారు. మిఠాయిలు పంచుకుని  సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు, అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 


logo